త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh | విడాకుల రూమ‌ర్లు – త‌ప్పుడు క‌థ‌నాల‌పై పోలీసుల‌కు విజ‌య్, ర‌ష్మిక మేనేజ‌ర్ కంప్లైంట్‌

సోష‌ల్ మీడియాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌పై జ‌రుగుతోన్న దుష్ప్ర‌చారంపై వారి టీమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు పోస్ట్‌లు పెడుతోన్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు.

N

Entertainment | Published On Oct 26, 2026, 7.59 pm IST

Virosh | విడాకుల రూమ‌ర్లు  –  త‌ప్పుడు క‌థ‌నాల‌పై  పోలీసుల‌కు విజ‌య్, ర‌ష్మిక మేనేజ‌ర్ కంప్లైంట్‌
Advertisement

Virosh | సోష‌ల్ మీడియాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda ), ర‌ష్మిక మంద‌న్న‌ల‌పై (Rashmika Mandanna) జ‌రుగుతోన్న అస‌త్య‌పు ప్ర‌చారాల‌పై విరోష్ టీమ్ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న కాఫీ విత్ క‌ర‌ణ్ షోకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు. ఈ షోలో త‌మ ప్రేమ‌, పెళ్లి బంధం గురించి విజ‌య్‌, ర‌ష్మిక ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ర‌ష్మిక త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని వంద సార్లు అడిగింద‌ని విజ‌య్ చెప్పారు. పెళ్లి ఎప్పుడూ అని తాను ఏడాది మొత్తం విజ‌య్‌ని అడుగుతూనే వ‌చ్చాన‌ని ర‌ష్మిక కూడా అన్న‌ది.

విడాకులు...

ఈ వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తూ పోస్ట్‌లు పెడుతోన్నారు. మ‌రోవైపు విజ‌య్‌, ర‌ష్మిక మ‌ధ్య విడాకులు తీసుకుంటున్నార‌ని, సోష‌ల్ మీడియాలో ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేశారంటూ దుష్ప్ర‌చారం చేస్తున్నారు.

అస‌త్య‌పు వార్త‌లు...

ఈ అస‌త్య‌పు వార్త‌ల‌పై విజ‌య్, ర‌ష్మిక మేనేజ‌ర్ నిశాంత్ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో విరోష్ జోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు పోస్ట్‌లు పెడుతున్నార‌ని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని, అభిప్రాయాలు వెల్లడించడాన్ని, సద్విమర్శలను తాము గౌరవిస్తామని, అయితే ఇలా ఉద్దేశ‌పూర్వ‌కంగా తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఒప్పుకోమని విరోష్ టీమ్ పోలీస్ అధికారులకు తెలియజేశారు. ఈ ఫేక్ పోస్ట్ లకు సంబంధించిన అక్కౌంట్స్, స్క్రీన్ షాట్స్, ఇతర సమాచారాన్ని సైబర్ క్రైమ్ డీసీపీకి వారు అందజేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వెయ్యి సార్లు అయినా ప్ర‌పోజ్ చేస్తా...

ఈ విమ‌ర్శ‌ల‌పై ర‌ష్మిక కూడా రియాక్ట్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్ర‌వారం ఓ పోస్ట్ పెట్టింది. విజ‌య్‌కి వంద సార్లు కాదు...వెయ్యి సార్లు అయినా ప్ర‌పోజ్ చేస్తాన‌ని అన్న‌ది. క‌ష్టాల్లో విజ‌య్ త‌నకు అండ‌గా నిల‌బ‌డ్డాడ‌ని చెప్పింది. విజ‌య్ అంటే త‌న‌కు పిచ్చి ప్రేమ అని పేర్కొన్న‌ది. భార్య ర‌ష్మిక‌కు విజ‌య్ స‌పోర్ట్‌గా నిలిచారు. ప్ర‌పంచ‌మంతా మాకు వ్య‌తిరేకంగా ఉన్నా...మేము మాత్రం సంతోషంగానే ఉంటామంటూ ఓ పోస్ట్ పెట్టారు. ర‌ష్మిక‌తో క‌లిసి సంతోషంగా ఉన్న ఓ రొమాంటిక్ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నాడు.

 

Advertisement
Advertisement