Ott Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – తెలుగు సినిమాలు హైలైట్…
విజయ్ సేతుపతి, కీర్తి సురేష్‌తో పాటు స్టార్ హీరోహీరోయిన్లు నటించిన పలు సినిమాలు, సిరీస్‌లు ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇందులో ఎక్కువ తెలుగు సినిమాలే ఉండటం గమనార్హం. ఆ సినిమాలు జాబితా ఇదే...
Entertainment | Published On Oct 30, 2026, 5.17 pm IST
Ott Releases | ఈ వారం ఓటీటీలో పలు తెలుగు సినిమాలు సందడి చేశాయి. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన ఆ సినిమా ఏవంటే..
నెట్‌ఫ్లిక్స్
సిగ్మా (తమిళ్ )
దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన తమిళ మూవీ సిగ్మా శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. థియేటర్లలో ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
బత్తా (తమిళ్)
విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ బత్తా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మించిన ఈ సినిమాకు బాలాజీ దర్శకత్వం వహించాడు.
సబ్ ఇన్స్‌పెక్టర్ యుగంధర్ (తెలుగు)
అవరాచన్ అండ్ సన్స్ (మలయాళం)
దిండోరా వెబ్‌సిరీస్ (హిందీ)
అక్క వెబ్‌సిరీస్ (హిందీ)
కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ వెబ్‌సిరీస్ అక్క శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ సిరీస్‌ను నిర్మించింది.
మీతే మై క్యాహై (హిందీ)
మినిమం వేజ్ (ఇంగ్లీష్)
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (తెలుగు)
అమెజాన్ ప్రైమ్ వీడియో
కామ్రేడ్ కళ్యాణ్ (తెలుగు)
శ్రీవిష్ణు హీరోగా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన కామ్రేడ్ కళ్యాణ్ కమర్షియల్‌గా మంచి వసూళ్లను దక్కించుకుంది. జానకిరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది.
మీర్జాపూర్ (హిందీ)
ఈటీవీ విన్ ఓటీటీ
తెల్లకాగితం (తెలుగు)
జీ5 ఓటీటీ
రుద్రవనం పీఎస్ వెబ్‌సిరీస్ (తెలుగు)
నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ రుద్రవనం పీఎస్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో చారువాకన్, నారాయణస్వామి, బెనర్జీ కీలక పాత్రలు పోషించారు.
సోనీలివ్ ఓటీటీ
ఇమ్మెర్టల్ (తమిళ్)
జియో హాట్ స్టార్
లవ్ ఆల్వెస్ (తమిళ్)
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nayanthara | మనసు మార్చుకున్న నయన్ – మాజీ ప్రియుడితో సినిమా…
అక్టోబర్ 30, 2026

Web Series Review | రుద్రవనం రివ్యూ – ట్విస్ట్‌లతో సాగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
అక్టోబర్ 30, 2026

Mani Ratnam | అనౌన్స్ చేసిన ఆరు నెలల్లోనే రిలీజ్ – సాయిపల్లవి, మణిరత్నం మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●IDBI Deal | కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను తమ వ్యక్తిగత ఆస్తిలా వాడుకుంది
- ●Binance | క్రిప్టో కరెన్సీ చోరీ జరిగితే నష్టం ఎవరు చెల్లిస్తారు.. బైనాన్స్ చెబుతున్నది జరిగేనా..?
- ●Ponguleti Srinivas Reddy | మియాపూర్ భూములు అమ్మి.. పేదింటి ఆడబిడ్డలకు ఇళ్లు కట్టిస్తాం
- ●Meta | మెటా నుంచి ఏఐ ఫ్యాషన్ యాప్.. మీ దగ్గరున్న దుస్తులతోనే కొత్త లుక్స్..
- ●Kollywood | కోలీవుడ్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత - అదుర్స్‌లో ఎన్టీఆర్ బామ్మగా...
- ●Arshdeep Singh | టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత!

IDBI Deal | కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను తమ వ్యక్తిగత ఆస్తిలా వాడుకుంది

Binance | క్రిప్టో కరెన్సీ చోరీ జరిగితే నష్టం ఎవరు చెల్లిస్తారు.. బైనాన్స్ చెబుతున్నది జరిగేనా..?

Ponguleti Srinivas Reddy | మియాపూర్ భూములు అమ్మి.. పేదింటి ఆడబిడ్డలకు ఇళ్లు కట్టిస్తాం

Meta | మెటా నుంచి ఏఐ ఫ్యాషన్ యాప్.. మీ దగ్గరున్న దుస్తులతోనే కొత్త లుక్స్..



