త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో – టైటిల్ ఇదే – ఫ‌స్ట్ గెస్ట్‌లు ఎవ‌రంటే?

మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ కోసం ఓ టాక్ షో చేయ‌బోతున్నారు. ఆయ‌న హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న ఈ షోకు మెగావెర్స్ అనే పేరును ఖ‌రారు చేశారు. డిసెంబ‌ర్ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సెలిబ్రిటీ టాక్ షోలో ఫ‌స్ట్ గెస్ట్‌లుగా టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్లు క‌నిపించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Oct 27, 2026, 2.52 pm IST

Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో – టైటిల్ ఇదే – ఫ‌స్ట్ గెస్ట్‌లు ఎవ‌రంటే?
Advertisement

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హోస్ట్‌గా కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నారు. ఓటీటీ కోసం ఓ టాక్ షో చేయ‌బోతున్నారు. ఈ షో టైటిల్‌తో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఖ‌రారు అయ్యాయి. అంతే కాకుండా మెగాస్టార్ టాక్ షోకు అటెండ్ కానున్న తొలి గెస్ట్‌లు ఎవ‌ర‌న్న‌ది కూడా రివీలైంది.

మెగావెర్స్‌...

చిరంజీవి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న ఈ సెలిబ్రిటీ టాక్ షోకు మెగావెర్స్ అనే పేరును ఖ‌రారు చేశారు. దిగ్గ‌జ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) డిసెంబ‌ర్ నుంచి మెగావెర్స్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ షో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్లు బ్ర‌హ్మానందం, సునీల్‌తో పాటు స‌త్య అటెండ్ కానున్నారు.

సినీ జ‌ర్నీ...

ఈ తొలి ఎపిసోడ్ తాలూకు షూటింగ్ మంగ‌ళ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో మొద‌లైంది. అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన స్పెష‌ల్ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ముగ్గురు క‌మెడియ‌న్ల సినీ జ‌ర్నీ, టాలీవుడ్‌లో నిల‌దొక్కునే క్ర‌మంలో వారికి ఎదురైన క‌ష్టాలు, హాస్య‌న‌టుల‌ మ‌ధ్య పోటీతో పాటు ప‌లు అంశాల‌తో స‌ర‌దాగా ఈ టాక్ షో ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

మెగా హీరోలు...

మొత్తం 12 నుంచి ప‌దిహేను ఎపిసోడ్స్‌తో మెగా వెర్స్ ఫ‌స్ట్ సీజ‌న్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ షోకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్‌, నాగ‌బాబుతో పాటు మిగిలిన మెగా యంగ్ హీరోలు కూడా అటెండ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ టాక్ షోకు చిరంజీవి మ్యాన‌రిజ‌మ్స్‌, ఆయ‌న పంచ్‌లు, ప్రాస‌లు హైలైట్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

రికార్డ్ రెమ్యూన‌రేష‌న్‌

మెగావెర్స్ కోసం చిరంజీవి రికార్డ్ రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఒక్కో ఎపిసోడ్‌కు 12 నుంచి 14 కోట్ల మ‌ధ్య పారితోషికం అందుకోనున్న‌ట్లు చెబుతోన్నారు. మెగావెర్స్ ద్వారా టాక్ షో కోసం హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించ‌నున్న ఇండియ‌న్ యాక్ట‌ర్‌గా చిరంజీవి నిల‌వ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

కాకా...విశ్వంభర...
ప్ర‌జెంట్‌ కాకా (Kaaka Movie)మూవీ షూటింగ్‌తో చిరంజీవి బిజీగా ఉన్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. అన‌స్వ‌ర రాజ‌న్‌, నివేదా పేతురాజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. చిరంజీవి మ‌రో మూవీ విశ్వంభ‌ర రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

 

Advertisement
Advertisement