Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ – రిలీజ్ డేట్ కన్ఫామ్
విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయబోతుంది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది.
Entertainment | Published On Aug 27, 2026, 11.52 am IST
Ranabaali Movie |రణబాలి కొత్త రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ వచ్చేసింది. దసరాకు ఈ పాన్ ఇండియన్ మూవీ థియేటర్లలో సందడి చేయబోతుంది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత సెప్టెంబర్ 11న రణబాలిని థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ మైసా షూటింగ్‌లో రష్మిక గాయపడటంతో సినిమాను వాయిదావేశారు.
దసరా బరిలో...
తాజాగా రణబాలి కొత్త రిలీజ్ డేట్‌ను గురువారం విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశాడు. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించాడు. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో నుదుటిపై విభూతి, భుజంపై కత్తితో యోధుడి విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భార్యాభర్తలుగా...
రణబాలిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. ఆంగ్లేయులను ఎదురించి పోరాడే రణబాలి అనే వీరుడిగా విజయ్ దేవరకొండ కనిపించబోతుండగా...అతడి భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బండి నారాయణస్వామి రాసిన శప్తభూమి అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్‌లో...
మైసా షూటింగ్‌లో గాయపడ్డ రష్మిక మందన్న సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి తిరిగి రణబాలి షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. రణబాలికి సైరాట్ ఫేమ్ అజయ్, అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక కాంబోలో వస్తోన్న ఈ హ్యాట్రిక్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరద బీభత్సం... వీడియోలు
- ●KTR | మీ ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు స్ఫూర్తి.. కేటీఆర్‌కు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆహ్వానం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. తగ్గిన బంగారం ధరలు..
- ●Nepal Flash Floods | నేపాల్ జల ప్రళయం.. 300 మంది భారతీయులు గల్లంతు.. పొంచి ఉన్న మరో ముప్పు
- ●Bill Gates | కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐకి ఇవ్వొద్దు.. బిల్ గేట్స్ హెచ్చరిక..
- ●RS Praveen Kumar | రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఆంధ్ర న్యూస్ చానళ్లకు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Nepal Floods | నేపాల్‌లో వరద బీభత్సం... వీడియోలు

KTR | మీ ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు స్ఫూర్తి.. కేటీఆర్‌కు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆహ్వానం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. తగ్గిన బంగారం ధరలు..

Nepal Flash Floods | నేపాల్ జల ప్రళయం.. 300 మంది భారతీయులు గల్లంతు.. పొంచి ఉన్న మరో ముప్పు






