త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shehnaaz Gill | షూటింగ్‌లో ముక్కుపుడ‌క మింగేసిన హీరోయిన్ – వీడియో వైర‌ల్‌

పంజాబీ హీరోయిన్ షెహ‌నాజ్ గిల్‌కు సినిమా షూటింగ్‌లో ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది. ఓ ఛేజింగ్ సీన్ షూట్ చేస్తుండ‌గా ముక్కుపుడ‌క జారి నోటిలో ప‌డింది.ఆ ముక్కుపుడ‌కను మింగేసిన హీరోయిన్ శ్వాస ఆడ‌క ఇబ్బందులు ప‌డింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Aug 11, 2026, 4.13 pm IST

Shehnaaz Gill | షూటింగ్‌లో ముక్కుపుడ‌క మింగేసిన హీరోయిన్ – వీడియో వైర‌ల్‌
Advertisement

Shehnaaz Gill | సినిమాల కోసం హీరోహీరోయిన్లు చాలానే రిస్క్‌లు తీసుకుంటుంటారు. షూటింగ్‌ల‌లో కొన్ని సార్లు ఊహించ‌ని ప్ర‌మాదాలు ఎదుర‌వుతుంటాయి. న‌టీన‌టుల‌ ప్రాణాల‌కే ముప్పు ఏర్ప‌డే ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. బిగ్‌బాస్ బ్యూటీ, పంజాబీ హీరోయిన్ షెహ‌నాజ్ గిల్‌కు అలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌య్యింది. విచిత్ర‌మైన ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌స్తుతం పంజాబీ భాష‌లో ఇష్క్ నామా పేరుతో ఓ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ చేస్తోంది షెహ‌నాజ్ గిల్‌. అర్వింద‌ర్ ఖైరా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో జై రంద్వా హీరోగా న‌టిస్తున్నాడు. సౌర‌భ్ స‌చ్‌దేవా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ఛేజింగ్ సీన్...

ఈ సినిమా షూటింగ్‌లో షెహ‌నాజ్ గిల్‌పై డైరెక్ట‌ర్ ఓ ఛేజింగ్ సీన్ షూట్ చేస్తుండ‌గా...ప‌రిగెత్తే క్ర‌మంలో పొర‌పాటున ముక్కుపుడ‌క జారిపోయి ఆమె నోటిలో ప‌డింది. చూసుకోకుండా హెహ‌నాజ్ గిల్ ఆ ముక్కుపుడ‌క‌ను మింగేసింది. దాంతో ఊపిరి ఆడ‌క ఇబ్బందులు ప‌డింది. ప్ర‌మాదాన్ని గుర్తించిన మేక‌ర్స్ షూటింగ్‌ను నిలిపేశారు. శ్వాస ఆడ‌క స‌త‌మ‌త‌మ‌వుతోన్న హెహ‌నాజ్ గిల్‌కు సౌర‌భ్ స‌చ్‌దేవ్ వీపు భాగంలో గ‌ట్టిగా త‌డుతూ సాయం చేశాడు. హెహ‌నాజ్‌కు ఏమైందో తెలియ‌క సెట్స్‌లో అంద‌రూ కంగారు ప‌డిపోయారు. క్షేమంగా బ‌య‌ట‌పడ‌టంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్ర‌మాద సంఘ‌ట‌న తాలూకు వీడియోను హెహ‌నాజ్ గిల్ స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

ప్రాణాలు ముఖ్య‌మే...

సినిమాలే కాదు ప్రాణాలు ముఖ్య‌మేన‌ని నెటిజ‌న్లు ఈ వీడియోను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. కొన్ని సార్లు ప్ర‌మాదం ఏ రూపంలో వ‌స్తుందో ఊహించ‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు.

బిగ్‌బాస్‌తో ఫేమ‌స్‌...

హిందీ బిగ్‌బాస్ 13తో హెహ‌నాజ్ గిల్ ఫేమ‌స్ అయ్యింది. ఈ సీజ‌న్‌లో సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. స‌ల్మాన్ ఖాన్ కిసి కా భాయ్‌, కిసి కీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో మూడే సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఎక్కువ‌గా పంజాబీ సినిమాల్లో న‌టిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

Advertisement
Advertisement