Anasuya | గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ పోస్ట్ – ఆ హీరోకు కౌంటర్ అంటోన్న నెటిజన్లు
శనివారం అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పుడే ఒక గుమ్మడికాయ దొంగ వీడియో చూశా అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. ఓ టాలీవుడ్ హీరో గురించే అనసూయ ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Entertainment | Published On Aug 9, 2026, 3.57 pm IST
Anasuya | యాక్టర్ శివాజీతో గొడవ తర్వాత కాంట్రవర్సీలకు దూరంగా ఉంటోంది అనసూయ. సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తోంది. సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చిన రంగమ్మత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, బ్రాండ్ ప్రమోషన్స్‌తో బిజీగా కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పట్లో ఎక్కువగా బోల్డ్ ఫొటోలు పెట్టేది. కానీ గత కొద్ది రోజులుగా చీరల్లో పద్దతిగా కనిపించే ఫొటోలు మాత్రమే పోస్ట్ చేస్తోంది. అనసూయలో వచ్చిన ఈ మార్పు ఫ్యాన్స్‌ను విస్మయానికి గురిచేస్తోంది.
గుమ్మడికాయ దొంగ....
లాంగ్ గ్యాప్ తర్వాత శనివారం అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. "ఇప్పుడే ఒక గుమ్మడికాయ దొంగ వీడియో చూశా. తెలివైన వాడు అని చెప్పుకుంటారు కదా. కానీ అతడి ప్రవర్తన చాలా సిల్లీగా ఉందంటూ" ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌కు బలవంతంగా నవ్వు ఆపుకుంటున్న తన ఫొటోను జోడించింది.
అనసూయ పెట్టిన పోస్ట్ ఎవరి గురించి అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. కొందరు నెటిజన్లు విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు. లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ మూవీ తొలుత విజయ్ దేవరకొండ చేయాల్సింది. దర్శకుడు అతడికి కథ కూడా వినిపించాడు. కానీ కింగ్డమ్ లాంటి ప్లాప్ సినిమా కోసం విజయ్ డీసీని వదలుకున్నాడు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ వీడియో ఇటటటటటప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో క్లిప్‌ను ఉద్దేశించే గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. విజయ్‌కి కథలు ఎంచుకోవడం రాదంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఈ పోస్ట్‌తో సెటైర్లు వేసిందని అంటున్నారు.
అర్జున్ రెడ్డి నుంచి.....
విజయ్ దేవరకొండను విమర్శిస్తూ పోస్ట్‌లు పెట్టడం, కామెంట్లు చేయడం అనసూయకు ఇది కొత్తేం కాదు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి అతడిని ట్రోల్ చేస్తూనే వస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాలోని డైలాగ్స్, ఆ సినిమా ప్రమోషన్స్‌లో విజయ్ స్పీచ్‌లపై విమర్శలు గుప్పించింది. ఆ తర్వాత లైగర్ ఫ్లాప్ టైమ్‌లో కర్మ అనుభవించకతప్పదు అంటూ అనసూయ పోస్ట్ పెట్టింది. డీసీతో మరోసారి సందర్భం దొరకడంతో విజయ్‌కి అనసూయ కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | నిరుపేదలను డాక్టర్లను చేసే బాధ్యత నాదే.. పట్టుదలతో చదివి గొప్ప ఆఫీసర్లుగా ఎదగండి
- ●NALSAR Students vs CJI Surya Kant | కాన్వకేషన్‌కు 'చీఫ్ గెస్ట్'గా సీజేఐ సూర్యకాంత్ వద్దే వద్దు: నల్సార్ విద్యార్థుల సంచలన నిర్ణయం
- ●Aircraft Crash | బరామతిలో కూలిన ట్రైయినీ విమానం.. ఇద్దరు పైలట్లు సేఫ్
- ●Bigg Boss | బిగ్‌బాస్‌లోకి గుండె నిండా గుడి గంటలు బాలు - సీరియల్ నుంచి ఔట్ - రూమర్లపై క్లారిటీ వచ్చేసింది!
- ●Ministers in Bonaalu Festival | ప్రజలందిరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి.. ఆయురారోగ్యాలతో మెలగాలని ప్రార్థించాం
- ●Trisha | అన్నతో విభేదాలు - తమ్ముడితో సినిమా - త్రిష నిర్ణయాలు ఊహాతీతం

Harish Rao | నిరుపేదలను డాక్టర్లను చేసే బాధ్యత నాదే.. పట్టుదలతో చదివి గొప్ప ఆఫీసర్లుగా ఎదగండి

NALSAR Students vs CJI Surya Kant | కాన్వకేషన్‌కు 'చీఫ్ గెస్ట్'గా సీజేఐ సూర్యకాంత్ వద్దే వద్దు: నల్సార్ విద్యార్థుల సంచలన నిర్ణయం

Aircraft Crash | బరామతిలో కూలిన ట్రైయినీ విమానం.. ఇద్దరు పైలట్లు సేఫ్

Bigg Boss | బిగ్‌బాస్‌లోకి గుండె నిండా గుడి గంటలు బాలు - సీరియల్ నుంచి ఔట్ - రూమర్లపై క్లారిటీ వచ్చేసింది!






