Vijay Rashmika Wedding | అఫీషియల్ – విజయ్, రష్మిక పెళ్లి ప్రకటన వచ్చేసింది – అభిమానులు ఇచ్చిన పేరుతోనే…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. అభిమానులు తమకు ప్రేమతో ఇచ్చిన ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతోనే వివాహ వేడుకను జరుపుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జంటగా విజయ్, రష్మిక పెళ్లి పోస్ట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Feb 22, 2026, 10.49 pm IST
Vijay Rashmika Wedding | టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్, రష్మిక పెళ్లి జరుగనుంది. పెళ్లి పనుల్లో ఈ జంట ఫుల్ బిజీగా ఉన్నారు.
ప్రైవసీ....
అయితే తమ వైవాహిక బంధాన్ని విజయ్, రష్మిక ఇప్పటివరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు. ఔనని చెప్పలేదు. అలాగని కాదని అనలేదు. తమ ప్రేమ విషయంలో ప్రైవసీ పాటిస్తూ వచ్చిన ఈ జంట పెళ్లికి ఇదే రూల్‌ను ఫాలో అవుతున్నారు. చాలా సీక్రెట్‌గా ఇన్నాళ్లు మెయింటేన్ చేస్తూ వచ్చారు.
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్....
ఎట్టకేలకు తమ పెళ్లిని అఫీషియల్‌గా ప్రకటించారు విజయ్, రష్మిక. ఇన్‌స్టాగ్రామ్‌లో జంటగా ఓ పోస్ట్ పెట్టారు. అభిమానులు ప్రేమతో తమకు ఇచ్చిన వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతోనే తమ పెళ్లిని జరుపుకోబోతున్నట్లు ఈ పోస్ట్‌లో విజయ్, రష్మిక పేర్కొన్నారు.
ప్రేమతో పేరు ఇచ్చారు....
"మేము ఎటువంటి ప్లాన్స్ వేసుకోకముందే, మా కోసం మేము దేనిని ఎంచుకోకముందే...మీరు ఎంతో ప్రేమతో మాకు ఓ పేరును ఇచ్చారు. మమ్మల్ని విరోష్‌గా పిలిచారు. నిండు మనసుతో మీరు ఇచ్చిన ఆ పేరునే మా పెళ్లి వేడుకకు పెట్టబోతున్నాం. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరుతోనే మా వివాహ వేడుకను జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం" అని ఈ పోస్ట్‌లో విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో విజయ్, రష్మిక చేసిన ఈ పోస్ట్‌లు వైరల్ అవుతోన్నాయి.
విదేశీ సెక్యూరిటీ...
ఫిబ్రవరి 26న జరుగనున్న విజయ్, రష్మిక పెళ్లికి కేవలం కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. పెళ్లికి విదేశీ సెక్యూరిటీతో పాటు రాజస్థాన్ పోలీసులు కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పెళ్లి తర్వాత విజయ్, రష్మికల రిసెప్షన్‌ను మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరుగనుంది. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులు అటెండ్ కానున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



