త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranabaali | ర‌ణ‌బాలి సినిమాపై డాక్యుమెంట‌రీ సిరీస్ – యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తున్న ర‌ణ‌బాలి సినిమాపై ఓ డాక్యుమెంట‌రీ సిరీస్ రాబోతుంది. రణబాలి నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో తెర‌కెక్కిన ఈ సిరీస్ నాలుగు ఎపిసోడ్స్‌తో యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Sep 27, 2026, 2.33 pm IST

Ranabaali | ర‌ణ‌బాలి సినిమాపై డాక్యుమెంట‌రీ సిరీస్ – యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌
Advertisement

Ranabaali |విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తున్న ర‌ణ‌బాలి మూవీ విజ‌య‌ద‌శ‌మికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. అక్టోబ‌ర్ 16న రిలీజ్ అవుతోంది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1870 ద‌శ‌కంలో బ్రిటీష‌ర్ల అకృత్యాల‌ను ఎదురించి పోరాడిన రాయ‌ల‌సీమ‌కు చెందిన ర‌ణ‌బాలి అనే యోధుడి క‌థ‌తో ఈ మూవీ రూపొందుతోంది.

భార్యాభ‌ర్త‌లుగానే...

ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న భార్యాభ‌ర్త‌లుగానే క‌నిపించ‌బోతున్నారు. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న తొలి సినిమా కావ‌డంతో ర‌ణ‌బాలిపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

హిస్టారిక‌ల్ మూవీ...

ఇటీవ‌లే ఈ హిస్టారిక‌ల్ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌మోష‌న్స్‌ను మేక‌ర్స్ డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేశారు. ర‌ణ‌బాలి సినిమాపై ఓ డాక్యుమెంట‌రీ సిరీస్‌ను రూపొందించారు. రణబాలి నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌ నాలుగు ఎపిసోడ్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

యూట్యూబ్‌లో...

యూట్యూబ్ లో ఈ నెల 28వ తేదీన ఫస్ట్ ఎపిసోడ్ 'ది ఫెమైన్ వి ఫర్ గాట్' స్ట్రీమింగ్ కు రానుంది. ఈ నెల 30న సెకండ్ ఎపిసోడ్ 'ది హిస్టరీ వి ఫర్ గాట్', అక్టోబర్ 2న మూడో ఎపిసోడ్ 'ది మెన్ వి ఫర్ గాట్స విడుద‌ల కానున్నాయి. నాలుగో ఎపిసోడ్ 'ది లాస్ట్ లోడ్స రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌ను చూడొచ్చ‌ని ప్ర‌క‌టించారు.

విజ‌య్‌, ర‌ష్మిక‌...

ర‌ణ‌బాలి క‌థేమిటి? తెర‌వెనుక ఏం జ‌రిగింది? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్‌తో పాటు మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు సినిమా కోసం తాము ప‌డిన క‌ష్టాన్ని ప్ర‌త్య‌క్షంగా ఈ డాక్యుమెంటరీలో వివ‌రించ‌నున్నారు.

కనుమరుగైన నిజాలతో...

చరిత్రకు రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి మనకు చెప్పింది, మరొకటి ఎవరికీ తెలియకుండా సమాధి చేయబడింది. మనకు తెలియకుండా చరిత్రలో కనుమరుగు చేసిన నిజాల‌ను డాక్యుమెంట‌రీ సిరీస్‌లో చూపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.ర‌ణ‌బాలి సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు అజ‌య్ - అతుల్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

 

Advertisement
Advertisement