త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | ద‌స‌రాకు రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ మూవీ లాంఛ్ – గెస్ట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

రంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్, సుకుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ రాబోతుంది. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 20న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

N

Entertainment | Published On Sep 26, 2026, 2.46 pm IST

Ram Charan | ద‌స‌రాకు రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ మూవీ లాంఛ్ – గెస్ట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
Advertisement

Ram Charan |  పెద్ది త‌ర్వాత త‌న నెక్స్ట్ సినిమాను క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో చేయ‌బోతున్నారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. రంగ‌స్థ‌లం త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో మూవీ ఇది . జూన్‌లోనే ఈ పాన్ ఇండియ‌న్ మూవీ ప్రారంభం కావాల్సింది. కానీ పెద్ది షూటింగ్‌లో చ‌ర‌ణ్ గాయ‌ప‌డ‌టంతో ఆల‌స్య‌మైంది. మ‌ణిక‌ట్టు గాయానికి ఇటీవ‌లే స‌ర్జ‌రీ చేసుకున్నారు చ‌ర‌ణ్. మ‌రో రెండు నెల‌ల్లో పూర్తిగా కోలుకోనున్నారు. ఈ గ్యాప్‌లో సుకుమార్ సినిమాకు సంబంధించిన లుక్, మేకోవ‌ర్‌ కోసం సిద్ధమ‌వుతోన్న‌ట్లు స‌మాచారం.

ద‌స‌రాకు లాంఛ్‌...

కాగా రామ్‌చ‌ర‌ణ్, సుకుమార్ మూవీ లాంఛ్ డేట్ ఖ‌రారైంది. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 20న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రా అండ్ ర‌స్టిక్‌...

రంగ‌స్థ‌లం, పుష్ప‌, పుష్ప 2 సినిమాల‌ను రా అండ్ ర‌స్టిక్ కాన్సెప్ట్‌ల‌తో తెర‌కెక్కించారు సుకుమార్‌. రామ్‌చ‌ర‌ణ్ సినిమాతో త‌న స్టైల్ మార్చ‌బోతున్న‌ట్లు తెలిసింది. స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీని రూపొందిస్తోన్న‌ట్లు స‌మాచారం. అంత‌ర్లీనంగా తండ్రీకొడుకుల ఎమోష‌న‌ల్ ఉంటుంద‌ని అంటున్నారు.

సారా అర్జున్‌....

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 17వ సినిమా ఇది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్‌, రుక్మిణి వ‌సంత్ పేర్లు ప్ర‌చారం జ‌రుగుతోన్నాయి. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌గా...పెద్ది మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాంతో సుకుమార్ సినిమాతో హిట్టు కొట్ట‌డం చ‌ర‌ణ్‌కు కీల‌కంగా మారింది.

 

Advertisement
Advertisement