Vijay Deverakonda | హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ – వైల్డ్ కాంబో సెట్
విజయ్ దేవరకొండ హీరోగా హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో కొత్త మూవీ శనివారం అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యింది. ఈ సినిమాకు టాప్ హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు.
Entertainment | Published On Apr 18, 2026, 1.12 pm IST
Vijay Deverakonda | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ...హాలీవుడ్ టెక్నీషియన్లతో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం రణబాలితో పాటు రౌడీ జనార్ధన సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. . ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అంగీకరించాడు. విజయ్ దేవరకొండ హీరోగా హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్‌లో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాను శనివారం అఫీషియల్‌గా ప్రకటించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆయుధాలతో...
ఇందులో యుద్ధంలో సైనికులు ధరించే మెటల్ గార్డ్స్ పెట్టుకొని గొలుసులతో కట్టేసి ఉన్న నాలుగు వేట కుక్కలను పట్టుకొని డిఫరెంట్ లుక్‌లో విజయ్ కనిపిస్తున్నాడు. అతడి వెనుక డైరెక్టర్‌తో పాటు సినిమా సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఒక్కొక్కరి చేతిలో యుద్ధాల్లో ఉపయోగించే గద, కత్తి, డాలు లాంటి ఆయుధాలు ఉండటం ఆసక్తిని పంచుతోంది. ఈ కోపమంతా ఒకప్పుడు అంతులేని ప్రేమనే అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే అభిమానుల్లో ఈ మూవీ హాట్ టాపిక్‌గా మారింది.
యాక్షన్ రివేంజ్ డ్రామా...
శౌర్యవ్‌కు సినిమా మీద ఉన్న ప్రేమకు, అతడి ఇమాజినేషన్‌కు తగ్గట్లుగా సినిమాకు అద్భుతమైన టెక్నికల్ టీమ్ దొరికిందని విజయ్ దేవరకొండ ఈ సినిమాను ఉద్దేశించి ట్వీట్ పెట్టారు. హిస్టారికల్ టచ్‌తో సాగే యాక్షన్ రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
హాలీవుడ్ టెక్నీషియన్లతో...
విజయ్ దేవరకొండ, శౌర్యువ్ మూవీతో హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్జినెజ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హౌజ్ ఆఫ్ డ్రాగన్ వెబ్ సిరీస్‌తో పాటు ఫాలౌట్, ట్రస్ట్ వంటి హాలీవుడ్ సినిమాలకు డీఓపీగా పనిచేశాడు అలెజాండ్రో. అలాగే స్నోపియర్సర్, గాడ్ ఆఫ్ ఈజిప్ట్, స్పైడర్ మ్యాన్ 2 సినిమాల ఫేమ్ ఎరిక్ డ్రస్ట్ ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అందిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ సమకూర్చుతున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



