త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Preethi Asrani | దీపావ‌ళికి థియేట‌ర్ల‌లోకి విజ‌య్ ఆంటోనీ నాన్న కుట్టి – హీరోయిన్‌గా హైద‌రాబాదీ బ్యూటీ

హైద‌రాబాదీ బ్యూటీ ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా తెలుగు కంటే త‌మిళంలోనే ఎక్కువ‌గా బిజీగా ఉంది.ఈ దీపావ‌ళికి నాన్న కుట్టి మూవీతో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన ఈ మూవీ న‌వంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Entertainment | Published On Oct 11, 2026, 4.47 pm IST

Preethi Asrani |  దీపావ‌ళికి థియేట‌ర్ల‌లోకి విజ‌య్ ఆంటోనీ నాన్న కుట్టి –  హీరోయిన్‌గా హైద‌రాబాదీ బ్యూటీ
Advertisement

Preethi Asrani |స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా హీరోగా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నాడు విజ‌య్ ఆంటోనీ. ఈ ఏడాది హీరోగా నూరుసామీ సినిమా చేశాడు. బూకీలో గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు. తాజాగా విజ‌య్ నెక్స్ట్ ఈ మూవీ దీపావ‌ళికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

తెలుగుతో పాటు త‌మిళంలో...

అప్పా కుట్టి పేరుతో త‌మిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగులోనూ విడుద‌ల కాబోతుంది. తెలుగు వెర్ష‌న్‌కు నాన్న కుట్టి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధంతో రూపొందుతోన్న ఈ సినిమాలో అచ్చ తెలుగు బ్యూటీ ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విజ‌య్ ఆంటోనీ భార్య‌ మీరా విజ‌య్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

దీపావ‌ళికి...

నాన్న కుట్టి రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. న‌వంబ‌ర్ 6న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ అంశాల‌కు థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్‌ను జోడించి ద‌ర్శ‌కుడు మార‌న్ ఈ సినిమాను రూపొందించారు. స్క్రీన్‌ప్లే కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌...

నాన్న కుట్టిలో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఎడిట‌ర్‌గా విజ‌య్ ఆంటోనీ వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. భ‌గ‌వ‌తి పెరుమాళ్‌, లిథ‌న్య‌, హ‌రిప్రియ ఇసై కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే నాన్న కుట్టి తెలుగు ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నారు.

హైద‌రాబాద్ బ్యూటీ...

హైద‌రాబాద్ బ్యూటీ ప్రీతి అస్రానీ చెల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో కెరీర్‌ను మొద‌లుపెట్టింది. ఏడీ ఇన్ఫినిటిమ్‌, ప్రెష‌ర్ కుక్క‌ర్‌తో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. అయోథీ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమానే పెద్ద హిట్ట‌వ్వ‌డంతో త‌మిళంలో బిజీగా మారింది. నాన్న కుట్టితో పాటు ఎస్ జే సూర్య‌తో కిల్ల‌ర్ సినిమా చేస్తోంది.

 

Advertisement
Advertisement