Dirty Picture 2 | పదిహేనేళ్ల తర్వాత డర్టీ పిక్చర్‌కు సీక్వెల్ – స్టార్ హీరోయిన్ నుంచి వేశ్యగా మారిన నటి కథతో..
విద్యాబాలన్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బోల్డ్ మూవీ డర్టీపిక్చర్‌కు పదిహేనేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. డర్టీపిక్చర్ 2 పేరుతో ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తోన్నట్లు నిర్మాత ఏక్తాకపూర్ ప్రకటించింది. 1980లో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నిషానూర్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోన్నట్లు సమాచారం.
Entertainment | Published On Oct 12, 2026, 4.28 pm IST
Dirty Picture 2 | విద్యాబాలన్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బోల్డ్ మూవీ డర్టీ పిక్చర్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకుంది. దక్షిణాదిలో గ్లామర్ క్వీన్‌గా పేరుతెచ్చుకున్న సిల్మ్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకుగాను బెస్ట్ హీరోయిన్‌గా విద్యాబాలన్‌కు నేషనల్ అవార్డు దక్కింది. కేవలం 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 120 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. విద్యాబాలన్ నటన, విశాల్ శేఖర్ మ్యూజిక్‌తో పాటు మిలాన్ లుథ్రియా టేకింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. 2011లో రిలీజైన డర్టీ పిక్చర్ ఆ ఏడాది బాలీవుడ్‌లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
పదిహేనేళ్ల తర్వాత...
దాదాపు పదిహేనేళ్ల తర్వాత డర్టీ పిక్చర్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. డర్టీ పిక్చర్ 2 పేరుతో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌ను నిర్మాత ఏక్తాకపూర్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇటీవల పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏక్తాకపూర్ డర్టీపిక్చర్ 2పై ఆసక్తికర కామెంట్లు చేసింది.
కథ సిద్ధం...
సీక్వెల్ కథ సిద్ధమైందని, ప్రస్తుతం తాను చేస్తోన్న బిగ్గెస్ట్ మూవీస్‌లో ఇది ఒకటని ఏక్తాకపూర్ చెప్పింది. డర్టీపిక్చర్‌కు మించి బోల్డ్ అంశాలతో ఈ సినిమా ఉంటుందని అన్నది. ఈ సీక్వెల్ కూడా ఓ సినీ నటి జీవితం ఆధారంగానే తెరకెక్కుతోన్నట్లు పేర్కొన్నది. గ్లామర్ ప్రపంచంలోని చీకటి కోణాలను, నటననే నమ్ముకొని ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ మహిళ జీవితం ఎలా విషాదంగా ముగిసిందనే అంశాలతో ఈ సీక్వెల్ రూపొందుతోన్నట్లు తెలిపింది. ఆ నటి ఎవరన్నది మాత్రం ఏక్తాకపూర్ రివీల్ చేయలేదు.
1980 దశకంలో...
తమిళ నటి నిషా నూర్ కథతో ఈ సినిమా రూపొందుతోన్నట్లు వార్తలొస్తున్నాయి. 1980 దశకంలో రజనీకాంత్, కమల్‌హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నిషా నూర్ ఓ నిర్మాత చేసిన మోసం కారణంగా వేశ్యగా మారింది. ఎయిడ్స్‌తో కన్నుమూసింది. నిషా నూర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఫిక్షనల్ బయోపిక్‌గా డర్టీ పిక్చర్ 2ను తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే డర్టీపిక్చర్ 2కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
సంబంధిత వార్తలు

Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్!
అక్టోబర్ 11, 2026

Ramayana | అఫీషియల్ – రామాయణ రిలీజ్ డేట్ ఫిక్స్ – మైథాలజీ మూవీపై కనిపించని బజ్
అక్టోబర్ 11, 2026

Keerthy Suresh | ఓటీటీలోకి కీర్తి సురేష్ బోల్డ్ మూవీ – తమిళంలో హిట్ – తెలుగులో డిజాస్టర్
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●CP Sajjanar | సాంస్కృతిక సామరస్యానికి ప్రతీక ‘నాడహబ్బ’
- ●Jaggareddy | రాహుల్ గాంధీకి మద్దతుగా మనం వీధుల్లోకి రావాల్సిందే
- ●CJI Surya Kant | రాహుల్, ఖర్గేలకు సీజేఐ షాక్: వ్యక్తిగత భేటీ కుదరదు.. న్యాయ నైతికతకు విరుద్ధమంటూ సూర్యకాంత్ కీలక లేఖ
- ●APP Results | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల.. 17 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
- ●MLC Dasoju Sravan Kumar | రూ.700 కోట్ల ఆలయ ప్రాజెక్ట్.. 948 కోట్లెందుకైంది?
- ●Tirumala Brahmotsavam | వాహనసేవ.. వైకుంఠనాథుడి వైభవానికి ప్రతిరూపం!

CP Sajjanar | సాంస్కృతిక సామరస్యానికి ప్రతీక ‘నాడహబ్బ’

Jaggareddy | రాహుల్ గాంధీకి మద్దతుగా మనం వీధుల్లోకి రావాల్సిందే

CJI Surya Kant | రాహుల్, ఖర్గేలకు సీజేఐ షాక్: వ్యక్తిగత భేటీ కుదరదు.. న్యాయ నైతికతకు విరుద్ధమంటూ సూర్యకాంత్ కీలక లేఖ

APP Results | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల.. 17 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్



