త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kollywood | కోలీవుడ్ న‌టి వ‌త్స‌ల రాజ‌గోపాల్ క‌న్నుమూత‌ – అదుర్స్‌లో ఎన్టీఆర్ బామ్మ‌గా…

కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. త‌మిళ సీనియ‌ర్ న‌టి వ‌త్స‌ల రాజ‌గోపాల్ వృద్ధాప్య సంబంధిత స‌మ‌స్య‌ల‌తో శుక్ర‌వారం క‌న్నుమూసింది. ఇర‌వై ఏళ్ల సినీ ప్ర‌యాణంలో 300ల‌కుపైగా సినిమాలు చేసింది. అదుర్స్‌లో ఎన్టీఆర్ బామ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు వ‌త్స‌ల రాజ‌గోపాల్‌.

N

Entertainment | Published On Oct 30, 2026, 4.32 pm IST

Kollywood | కోలీవుడ్ న‌టి వ‌త్స‌ల రాజ‌గోపాల్ క‌న్నుమూత‌ – అదుర్స్‌లో ఎన్టీఆర్ బామ్మ‌గా…
Advertisement

Kollywood | త‌మిళ సీనియ‌ర్ సినీ న‌టి వ‌త్స‌ల రాజ‌గోపాల్ (92) క‌న్నుమూశారు. వృద్దాప్య సంబంధిత స‌మ‌స్య‌ల‌తో శుక్ర‌వారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.  రంగ‌స్థ‌ల న‌టిగా వ‌త్స‌ల రాజ‌గోపాల్ కెరీర్ ప్రారంభ‌మైంది. నాటకాల ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో అమ్మ‌మ్మ‌, నాన‌మ్మ పాత్ర‌ల‌ను పోషించారు. తెలుగులో అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ బామ్మ‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

అర‌వై ఏళ్ల వ‌య‌సులో...

మ‌ణిర‌త్నం రోజా సినిమాతో అర‌వై ఏళ్ల వ‌య‌సులో సినీ రంగ ప్ర‌వేశం చేశారు వ‌త్స‌ల రాజ‌గోపాల్‌. ఇందులో హీరోయిన్ మ‌ధుబాల‌కు బామ్మ‌గా న‌టించారు. తొలి సినిమానే మంచి పేరు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టింది. రోజాతో బామ్మ పాత్ర‌ల‌కు కోలీవుడ్‌లో వ‌త్స‌ల రాజ‌గోపాల్ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయారు. ఇర‌వై ఏళ్ల సినీ ప్ర‌యాణంలో స‌తీ లీలావ‌తి, రిథ‌మ్‌, సెల్వ‌, విన్న‌ర్‌, ధామ్ ధూమ్ , అన్నియ‌న్‌, జ‌యం కొండ‌న్‌, ఉద‌య‌న్‌, క‌ళ్యాణ స‌మ‌యాల్ సాధంతో 300ల‌కుపైగా సినిమాలు చేసింది.

అప‌రిచితుడు...

వ‌త్స‌ల రాజ‌గోపాల్ న‌టించిన ప‌లు త‌మిళ సినిమాలు తెలుగులోకి అనువాద‌మ‌య్యాయి. అప‌రిచితుడు, ధామ్ ధూమ్‌, రిథ‌మ్‌, రోజా సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలిగా మారింది. సినిమాలు మాత్ర‌మే కాకుండా ఆమె న‌టించిన త‌మిళ‌ సీరియ‌ల్స్ కూడా తెలుగులోకి డ‌బ్ అయ్యాయి.

అదుర్స్‌లో..

వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అదుర్స్‌లో ఎన్టీఆర్ బామ్మ‌గా వ‌త్స‌ల రాజ‌గోపాల్ క‌నిపించారు. విల‌క్ష‌ణ డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకున్నారు. ఆమె న‌టించిన ఒకే ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

 

ట్యాగ్స్:

Celebrity DeathKollywood NewsTamil ActressTamil CinemaTamil TelevisionVatsala RajagopalVeteran Actress
Advertisement
Advertisement