Stock Markets | ఐటీ, ఫార్మా షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఐటీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 0.5 శాతం చొప్పున పెరిగాయి. అయితే అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ఆసియా మార్కెట్లలో నష్టాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి.
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఐటీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 0.5 శాతం చొప్పున పెరిగాయి. అయితే అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ఆసియా మార్కెట్లలో నష్టాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి.
ఐటీ, ఫార్మా షేర్లలో భారీగా కొనుగోళ్లు..
ఐటీ, ఫార్మాసూటికల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో మార్కెట్లకు మద్దతు లభించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు చెందిన నిఫ్టీ 50 సూచీ 116.35 పాయింట్లు (0.51 శాతం) పెరిగి 23,053.10 వద్ద స్థిరపడింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు చెందిన సెన్సెక్స్ 308.49 పాయింట్లు (0.42 శాతం) లాభపడి 74,459.53 వద్ద ముగిసింది. అయితే విస్తృత మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతు బలహీనంగా ఉండడంతోపాటు పలు కీలక రంగాల సూచీలు నష్టాల్లో ముగియడం మార్కెట్ జోరును పరిమితం చేసింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యధికంగా 2.16 శాతం లాభపడింది. నిఫ్టీ ఫార్మా 1.67 శాతం, నిఫ్టీ హెల్త్‌కేర్ 1.59 శాతం పెరిగాయి. మరోవైపు నిఫ్టీ ఆటో 0.82 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.59 శాతం, మీడియా 1.58 శాతం, మెటల్ 0.66 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.15 శాతం, రియాల్టీ 0.93 శాతం నష్టపోయాయి.
ఆందోళన కలిగిస్తున్న చమురు ధరలు..
నిఫ్టీ 50 షేర్లలో ట్రెంట్, ఇండిగో, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ ప్రధాన నష్టాలను నమోదు చేశాయి. పీఎల్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ విక్రమ్ కసత్ మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 115 డాలర్ల వద్ద ఉండడం భారత్ దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణం, కరెన్సీ స్థిరత్వంపై ఒత్తిడి పెంచుతోందని తెలిపారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు, దేశీయ పెట్టుబడుల ప్రవాహం మార్కెట్లకు మద్దతిస్తాయని, అయితే విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అధిక ముడిచమురు ధరల నేపథ్యంలో బలమైన ఆర్థిక పునాదులున్న కంపెనీల షేర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నిపుణుల అభిప్రాయం ఏమిటి..?
మరోవైపు రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ బాండ్ మార్కెట్ల పరిణామాలు కూడా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. బ్రిక్‌వర్క్ రేటింగ్స్ రీసెర్చ్ హెడ్ రాజీవ్ శరణ్ ప్రకారం.. శుక్రవారం ఉదయం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలపడి 95.19 వద్దకు చేరింది. గురువారం ముగింపు సమయంలో ఇది 95.26గా ఉంది. మధ్యాహ్నానికి రూపాయి విలువ 95.07 స్థాయికి చేరుకుంది. అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 4.90 శాతానికి తగ్గడం, డాలర్ ఇండెక్స్ 101.75 సమీపంలో బలహీనపడడం రూపాయి బలపడడానికి కారణాలుగా ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల షాక్‌లను ఎదుర్కొనేందుకు రూపాయి మారకం విలువ స్వేచ్ఛగా కదలడానికి అవకాశం ఇవ్వాలని, కరెన్సీకి మద్దతుగా ఆర్‌బీఐ తన విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయడం కంటే రూపాయినే తొలి రక్షణ సాధనంగా ఉపయోగించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడినట్లు వివరించారు. అయితే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 116 డాలర్ల సమీపంలో ఉండడం, గురువారం విదేశీ పెట్టుబడిదారులు రూ.944 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించడం రూపాయిపై ఒత్తిడి పెంచుతాయని, రూపాయి భారీగా పడిపోతే దేశీయ ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఫ్లాట్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి..
అక్టోబర్ 30, 2026

Stock Markets | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. భారత మార్కెట్లలో బుల్ ర్యాలీ..
అక్టోబర్ 29, 2026

US Federal Reserve | వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఫెడ్.. భారత మార్కెట్ల దారెటు..?
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Arshdeep Singh | టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత!
- ●Chanagani Dayakar | మియాపూర్ భూముల తీర్పు కేసీఆర్‌కు చెంప పెట్టు లాంటిది: చనగాని దయాకర్
- ●Online Dating App | డేటింగ్ యాప్‌తో ట్రాన్స్జెండర్ల కొత్త మోసం.. యువకులను ట్రాప్ చేసి దోపిడీ
- ●Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయంలో పూజలు - చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్
- ●Simhastha Kumbh | రేపటి నుంచి సింహస్థ కుంభమేళా షురూ.. 2027లో నాలుగు అమృత స్నానాలు ఎప్పుడంటే?
- ●Gig Workers | గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత.. జాతీయ బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం..

Arshdeep Singh | టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత!

Chanagani Dayakar | మియాపూర్ భూముల తీర్పు కేసీఆర్‌కు చెంప పెట్టు లాంటిది: చనగాని దయాకర్

Online Dating App | డేటింగ్ యాప్‌తో ట్రాన్స్జెండర్ల కొత్త మోసం.. యువకులను ట్రాప్ చేసి దోపిడీ

Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయంలో పూజలు - చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్



