త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | నిత్యారెడ్డి ఆగ‌యా – ధ‌నుష్ సినిమాలో పోలీస్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

త‌మిళ సినిమా కోసం ఖాకీ డ్రెస్ వేసింది సాయిప‌ల్ల‌వి. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ధ‌నుష్ హీరోగా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ మూవీ రాబోతుంది. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో నిత్యారెడ్డి అనే పోలీస్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతుంది.

N

Entertainment | Published On Oct 26, 2026, 4.22 pm IST

Sai Pallavi | నిత్యారెడ్డి ఆగ‌యా – ధ‌నుష్ సినిమాలో పోలీస్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి
Advertisement

Sai Pallavi |  కెరీర్ ఆరంభం నుంచి పాత్ర‌ల ఎంపిక‌లో వైవిధ్యంగా అడుగులు వేస్తోంది సాయిప‌ల్ల‌వి (Sai Pallavi). క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసినా కూడా క‌థ‌లో త‌న పాత్ర‌కు ప్రాధాన్యం ఉండాల‌ని త‌పిస్తుంటుంది. బ‌ల‌మైన ఎమోష‌న్స్‌తో పాటు స‌హ‌జ‌త్వం ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డుతుంటుంది. ప్రేమ‌క‌థ‌ల్లో ఎంత‌గా ఒదిగిపోతుందో సామాజిక ఇతివృత్తాల‌తో కూడిన క‌థ‌ల‌కు అదే స్థాయిలో న్యాయం చేస్తుంటుంది. ఆ విల‌క్ష‌ణీయ‌తే ఆమెను అగ్ర హీరోయిన్‌గా నిల‌బెట్టింది. ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.

ఖాకీ డ్రెస్‌లో...

కెరీర్‌లో ఎక్కువ‌గా సాఫ్ట్ రోల్స్ చేసిన సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్ టైమ్ ఖాకీ డ్రెస్‌లో క‌నిపించ‌బోతుంది. పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోంది. ధ‌నుష్ (Dhanush)హీరోగా నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామీ ద‌ర్శ‌క‌త్వంలో ఓమ్ పేరుతో ఓ యాక్ష‌న్ మూవీ రాబోతుంది. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా బ్యాక్‌డ్రాప్ ఈ త‌మిళ మూవీ తెర‌కెక్కుతోంది. 2015లో శేషాచ‌లం అడ‌వుల్లో ఇర‌వై మంది కూలీల‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. ఆ ఘ‌ట‌న త‌ర్వాత స్మ‌గ్లింగ్ నెట్‌వ‌ర్క్‌తో సంబంధం ఉన్న చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో కొంద‌రు సెలిబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ య‌దార్థ‌ సంఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తి పొంది ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ పెరియాసామీ ఓం సినిమాను రూపొందిస్తున్నారు.

నిత్యారెడ్డి...

ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. నిత్యారెడ్డి అనే ర‌ఫ్ అండ్ ట‌ఫ్ పోలీస్‌గా ఈ నాచుర‌ల్ బ్యూటీ క‌నిపించ‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు. మాస్ యాంగిల్‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా ఆమె క్యారెక్ట‌ర్ ఉండ‌బోతున్న‌ట్లు చూపించారు. శేషాచ‌లం ఎన్‌కౌంట‌ర్ కేసు ఇన్వేస్టిగేష‌న్‌లో పాల్గొన్న రియ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ల స్ఫూర్తితో ఆమె పాత్ర‌ను ద‌ర్శ‌కుడు డిజైన్ చేసిన‌ట్లు స‌మాచారం.

శ్రీలీల‌...

ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వితో పాటు శ్రీలీల (Sreeleela) మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఓం మూవీ న‌వంబ‌ర్ 20న తెలుగుతో పాటు త‌మిళంలో రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement