R B Choudary | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం – రోడ్డు ప్రమాదంలో దిగ్గజ నిర్మాత కన్నుమూత
దిగ్గజ సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి మంగళవారం హఠాన్మరణం చెందారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తెలుగులో సుస్వాగతం, ప్రియమైన నీకు, నువ్వు వస్తావనితో పాటు పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు ఆర్‌బీ చౌదరి.
Entertainment | Published On May 5, 2026, 7.57 pm IST
R B Choudary | తెలుగులో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్‌బీ చౌదరి కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌ను నెలకొల్పిన ఆర్‌బీ చౌదరి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తొంభైకిపైగా సినిమాలను నిర్మించారు. 1990 దశకంలో సక్సెస్‌ఫుల్ సినిమాలకు చిరునామాగా నిలిచారు.
వెంకటేష్, పవన్ కళ్యాణ్...
తెలుగులో అగ్ర హీరోలు వెంకటేష్, పవన్ కళ్యాణ్ మొదలుకొని నేటి తరం హీరోలు రామ్ చరణ్, తేజా సజ్జా వరకు అందరితో సినిమాలు చేశారు ఆర్‌బీ చౌదరి. తెలుగులో ఆర్‌బీ చౌదరి నిర్మించిన సూర్యవంశం, రాజా, సంక్రాంతి, సుస్వాగతం, నువ్వు వస్తావని, ప్రియమైన నీకు, నువ్వు వస్తావనితో పాటు పలు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అశ్లీలత అసభ్యతకు తావు లేకుండా కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలను రూపొందించారు.
కోలీవుడ్‌లో టాప్...
1988లో వచ్చిన అదిపాపం అనే మలయాళ సినిమాతో నిర్మాతగా ఆర్‌బీ చౌదరి ప్రయాణం ప్రారంభమైంది. మురళీ, ఆనంద్ బాబు హీరోలుగా విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన పుదు వసంతం సినిమాతో నిర్మాతగా తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆ సినిమాతో నిర్మాతగా కోలీవుడ్‌లో ఆర్‌బీ చౌదరి పేరు మారుమోగింది. తమిళంలో రజనీకాంత్, విజయ్ కాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్స్‌తో పలు సినిమాలు నిర్మించారు ఆర్‌బీ చౌదరి. ఎంతో మంది కొత్త దర్శకులను, నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు ఆర్‌బీ చౌదరి. కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న కేఎస్ రవికుమార్, విక్రమన్, లింగుసామి, శశి సహా మరికొంత మంది ఆర్‌బీ చౌదరి బ్యానర్‌తోనే తమ సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆర్‌బీ చౌదరి నిర్మించిన చివరి మూవీ మారేసన్ గత ఏడాది రిలీజైంది.
తండ్రి బాటలోనే...
ఆర్‌బీ చౌదరికి నలుగురు కుమారులు ఉన్నారు. వీరిలో జీతన్ రమేష్, జీవా తండ్రి బాటలోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు. జీవా హీరోగా కోలీవుడ్‌లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగులో యాత్ర, యాత్ర 2 సినిమాలు చేశారు. ఆర్ బీ చౌదరి భౌతిక కాయాన్ని ఉదయపూర్ నుండి చెన్నై తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్‌బీ చౌదరి మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
దిగ్భ్రాంతి కలిగించింది...పవన్ కళ్యాణ్
నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత ఆర్ బీ చౌదరి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. నేను నటించిన ‘సుస్వాగతం’ సినిమాను ఆర్‌బీ చౌదరి నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



