త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | ప‌న్నెండేళ్ల త‌ర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ – వెంక‌టేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్‌

వెంక‌టేష్‌, క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ జ‌న‌వ‌రి 12 విడుద‌ల వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఊటీలో మొద‌లైంది. ఈ షెడ్యూల్‌లో వెంక‌టేష్ - కీర్తి సురేష్, క‌ళ్యాణ్ రామ్ - కృతిశెట్టిల‌పై రెండు రొమాంటిక్ సాంగ్స్‌ను షూట్ చేయ‌బోతున్నారు.

N

Entertainment | Published On Oct 12, 2026, 6.09 pm IST

Keerthy Suresh | ప‌న్నెండేళ్ల త‌ర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ – వెంక‌టేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్‌
Advertisement

Keerthy Suresh |విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

రొమాంటిక్ సాంగ్స్‌...

జ‌న‌వ‌రి 12 విడుద‌ల‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఊటీలో ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్‌లో వెంక‌టేష్ - కీర్తి సురేష్, క‌ళ్యాణ్ రామ్ - కృతిశెట్టిల‌పై రెండు రొమాంటిక్ సాంగ్స్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు అనిల్ రావిపూడి. పాట‌ల‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ను కూడా షూట్ చేయ‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌లో హీరోహీరోయిన్ల‌తో పాటు అజ‌య్ ఘోష్‌, ఉపేంద్ర లిమాయోతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం మొత్తం పాల్గొన‌బోతున్నారు.

ఊటీ షెడ్యూల్‌...

ఊటీ షెడ్యూల్‌కు సంబంధించి ఓ వీడియోను మూవీ టీమ్ అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో తాము న‌టించిన సీన్లు చూసి నైస్ అంటూ మురిసిపోతూ కీర్తి సురేష్, కృతిశెట్టి క‌నిపించారు. ఆ త‌ర్వాత ఊటీ చ‌లికి వ‌ణికిపోతూ హీరోహీరోయిన్ల‌తో డైరెక్ట‌ర్ క‌నిపిచండం బ్యాక్‌గ్రౌండ్‌లో క్ష‌ణ‌క్ష‌ణం సినిమాలోని చ‌లి చంపుతున్న చ‌మ‌క్కులో అనే పాట వినిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

ప‌న్నెండేళ్ల త‌ర్వాత‌...

జ‌న‌వ‌రి 12 విడుద‌ల కోసం దాదాపు ప‌న్నెండేళ్ల త‌ర్వాత ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీలో అడుగుపెట్టింది. 2014 కీర్తి సురేష్ రింగ్‌మాస్ట‌ర్ షూటింగ్ ఊటీలో జ‌రిగింది.
రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో బావ‌బావ‌మ‌రుదుల అనుబంధంతో జ‌న‌వ‌రి 12 విడుద‌ల‌ను డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్నారు. ఇందులో వెంక‌టేష్‌కు జోడీగా కీర్తి సురేష్‌...క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో వెంక‌టేష్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంక‌టేష్, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రాబోతున్న ఐదో మూవీ ఇది. ఆ మ‌ల్టీస్టార‌ర్ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకురాబోతుంది.

 

Advertisement
Advertisement