త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | అప్పుడే డెబ్బై కోట్ల బిజినెస్.. వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ ఓటీటీ డీల్ క్లోజ్.. ప్లాట్‌ఫామ్ ఏదంటే?

వెంక‌టేష్‌, క‌ళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇటీవ‌లే సెట్స్‌పైకి వ‌చ్చింది. ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ కాక‌ముందే ఈ సినిమా ఓటీటీ బిజినెస్ క్లోజ‌య్యింది. ఈ సినిమా డిజిట‌ల్ రైల్స్‌ను జీ5 ఓటీటీ ద‌క్కించుకుంది.

N

Entertainment | Published On Jul 19, 2026, 7.51 pm IST

OTT  | అప్పుడే డెబ్బై కోట్ల బిజినెస్.. వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ ఓటీటీ డీల్ క్లోజ్.. ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Advertisement

OTT |  హీరో వెంక‌టేష్‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిల‌ది టాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఎఫ్ 2, ఎఫ్‌3తో పాటు సంక్రాంతికి వ‌స్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీలో వెంక‌టేష్ ఓ స్పెష‌ల్ రోల్‌లో క‌నిపించారు.

ఐదో మూవీ....

వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి క‌ల‌యిక‌లో ఐదో మూవీ రాబోతుంది. మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో వెంక‌టేష్‌తో పాటు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మ‌రో హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో వెంక‌టేష్‌కు జోడీగా కీర్తి సురేష్, క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఓటీటీ బిజినెస్ క్లోజ్‌...

ఇటీవ‌లే ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ సెట్స్‌పైకి వ‌చ్చింది. ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ కాక‌ముందే వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి సినిమా ఓటీటీ బిజినెస్ క్లోజ‌య్యింది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను జీ5 ఓటీటీ ద‌క్కించుకుంది. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా జీ5 ప్ర‌క‌టించింది.

70 కోట్లు...

వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి కాంబోకు ఉన్న క్రేజ్ కార‌ణంగా ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల కోసం గ‌ట్టి పోటీ ఏర్ప‌డిన‌ట్లు స‌మాచారం. చివ‌ర‌కు 70 కోట్ల‌కు జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. బండ్ల గ‌ణేష్, శ్రీమాన్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ క‌మెడియ‌న్లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి మూవీతో పాటు నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ‌, బాల‌కృష్ణ గోపీచంద్ మ‌లినేని సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను కూడా జీ5 ఓటీటీ ద‌క్కించుకుంది.

 

 

 

Advertisement
Advertisement