త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadarsha Kutumbam Postpone | వెంక‌టేష్ ఆద‌ర్శ కుటుంబం మ‌ళ్లీ వాయిదా – అక్టోబ‌ర్ రేసు నుంచి ఔట్‌?

వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆద‌ర్శ‌కుటుంబం సినిమా మ‌రోసారి వాయిదాప‌డింది. అక్టోబ‌ర్ 9న విడుద‌ల కావాల్సిన ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్న‌ట్లు నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ప్ర‌క‌టించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల డిలే వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సివ‌చ్చింద‌ని అన్నారు.

N

Entertainment | Published On Oct 5, 2026, 4.23 pm IST

Aadarsha Kutumbam Postpone |  వెంక‌టేష్ ఆద‌ర్శ కుటుంబం మ‌ళ్లీ వాయిదా – అక్టోబ‌ర్ రేసు నుంచి ఔట్‌?
Advertisement

Aadarsha Kutumbam Postpone |  వెంక‌టేష్ ఆద‌ర్శ కుటుంబం మూవీ మ‌రోసారి పోస్ట్‌పోన్ అయ్యింది. అక్టోబ‌ర్ 9న విడుద‌ల కావాల్సిన ఈ సినిమాను వాయిదావేస్తున్న‌ట్లు నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ప్ర‌క‌టించారు. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తికాక‌పోవ‌డం వ‌ల్లే సినిమాను ప్ర‌క‌టించిన డేట్‌కు తీసుకురాలేక‌పోతున్నామ‌ని అన్నారు. ఆద‌ర్శ కుటుంబం సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో డింపుల్ హ‌య‌తి, నివేదా పేతురాజ్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించారు.

రెండోసారి...

తొలుత ఈ సినిమాను అక్టోబ‌ర్ 2న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 9కి వాయిదావేశారు. తాజాగా రెండోసారి పోస్ట్‌పోన్ అయ్యింది. సోమ‌వారం హైద‌రాబాద్‌లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటుచేసిన‌ నిర్మాత నాగ‌వంశీ ఆద‌ర్శ‌కుటుంబం పోస్ట్‌పోన్‌కు గ‌ల కార‌ణాల‌ను రివీల్ చేశారు.

బుకింగ్స్ ఓపెన్‌...

"అక్టోబ‌ర్ 9న ఖ‌చ్చితంగా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకున్నాం. ఓవ‌ర్‌సీస్‌లో బుక్సింగ్స్ కూడా ఓపెన్ చేశాం. కానీ పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్య‌మ‌వుతున్నాయి. కాంప్ర‌మైజ్ అయ్యి రిలీజ్ చేస్తే విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందుకే సినిమాను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఇంత‌కంటే పెద్ద కార‌ణం లేదు" అని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అన్నారు.

టైమ్ స‌రిపోలేదు...

"సినిమాకు ప‌బ్లిసిటీ కూడా స‌రిపోలేద‌ని వెంక‌టేష్ ఫ్యాన్స్ విమ‌ర్శిస్తున్నారు. ట్రైల‌ర్ క‌ట్ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇన్ని ఇబ్బందుల మ‌ధ్య రిస్క్‌లు తీసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌నిపించింది. మ‌రో రెండు మూడు వారాల్లో రెండు పాట‌ల‌తో పాటు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తాం. స‌రైన ప‌బ్లిసిటీతో ఈ సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తాం అని ప్ర‌క‌టించారు. చివ‌రి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల కొంద‌రు చిన్న సినిమాల నిర్మాత‌లు ఇబ్బందులు ప‌డ్డార‌ని, వారికి సారీ చెబుతున్నాన‌ని" నాగ‌వంశీ చెప్పారు. అక్టోబ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ కావ‌డం అనుమానంగానే క‌నిపిస్తోంది.

ఆద‌ర్శ కుటుంబం సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. మిడిల్‌క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా త్రివిక్ర‌మ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఓ పెద్ద ప్ర‌మాదం నుంచి త‌న కుటుంబాన్ని కాపాడ‌టం కోసం ఓ తండ్రి ఎలాంటి పోరాటం చేశాడు అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందుతోంది.

 

Advertisement
Advertisement