Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట – ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ సింగిల్ ఆదివారం రిలీజైంది. నారాయణమ్మ అంటూ ఫోక్ స్టైల్‌లో సాగిన ఈ పాటలో వెంకటేష్ ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ పాటలో శ్రీనిధి శెట్టితో పాటు డింపుల్ హయతి, నివేదా పేతురాజ్ నటించారు.
Entertainment | Published On Sep 27, 2026, 5.58 pm IST
Aadarsha Kutumbam | వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆదర్శ కుటుంబం నుంచి తొలి సాంగ్ వచ్చేసింది. ఫన్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్ 9న ఆదర్శకుటుంబం థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ పాటలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధిశెట్టి, నివేదా పేతురాజ్, డింపుల్ హయతి కలిసి నటించారు. జానపద శైలిలో సాగిన ఈ పాటను మంగ్లీ ఆలపించింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చగా... తమన్ మ్యూజిక్ అందించారు. లిరిక్స్, ముగ్గురు హీరోయిన్ల గ్లామర్, విజువల్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలిచాయి. నారాయణమ్మ సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో హీరో వెంకటేష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పాటు డింపుల్ హయతి పాల్గొన్నారు.
మిడిల్ క్లాస్...
అప్పులతో సతమతమయ్యే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి అనుకోకుండా కోటీశ్వరుడిగా మారుతాడు. ఐశ్వర్యంతో పాటుగా అనుకోని ప్రమాదాలు అతడిని వెంటాడుతాయి. అవేమిటి? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అతడు ఏం చేశాడు అనే అంశాలతో ఆదర్శ కుటుంబం సినిమాను తెరకెక్కిస్తోన్నారు త్రివిక్రమ్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నారా రోహిత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
చివరి నిమిషంలో వాయిదా...
ఆదర్శ కుటుంబం సినిమాను తొలుత అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని అనుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో చివరి నిమిషంలో అక్టోబర్ 9కి వాయిదాపడింది. మరోవైపు వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై సరైన బజ్ లేదు. నారాయణమ్మ సాంగ్ ఆ హైప్‌ను తీసుకొస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Venkatesh | ఆదర్శ కుటుంబం వాయిదా – వారం వెనక్కి వెళ్లిన వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ
సెప్టెంబర్ 22, 2026

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
సెప్టెంబర్ 21, 2026

Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు – ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!
- ●Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన
- ●Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు
- ●Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?
- ●Parvesh Verma Slap Video | రోడ్డు నాణ్యతపై నిలదీసినందుకు రెచ్చిపోయిన మంత్రి: లైవ్ తీస్తున్న వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన పర్వేశ్ వర్మ.. వీడియో వైరల్
- ●G Chinna Reddy | యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1 నియామకాలు చేపట్టాలి

PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!

Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన

Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు

Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?



