RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్‌బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..
RBI | దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీ రేట్ల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒకే రోజు, ఒకే మొత్తాన్ని డిపాజిట్ చేసిన కస్టమర్లకు దేశంలోని ఏ బ్రాంచ్‌లోనైనా ఒకే వడ్డీ రేటు ఇవ్వాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
RBI | దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీ రేట్ల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒకే రోజు, ఒకే మొత్తాన్ని డిపాజిట్ చేసిన కస్టమర్లకు దేశంలోని ఏ బ్రాంచ్‌లోనైనా ఒకే వడ్డీ రేటు ఇవ్వాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకే బ్యాంకుకు చెందిన వేర్వేరు బ్రాంచ్‌లలో ఒకే డిపాజిట్‌కు వేర్వేరు వడ్డీ రేట్లు ఇవ్వడాన్ని ఇకపై అనుమతించరు. ఈ కొత్త నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్ - ఇంటరెస్ట్ రేట్స్ ఆన్ డిపాజిట్స్) సెకండ్ అమెండ్‌మెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ 2026 పేరుతో జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
వడ్డీ రేట్లను కచ్చితంగా చెప్పాలి..
ఆర్‌బీఐ సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రకటించిన డిపాజిట్ వడ్డీ రేట్లనే అన్ని బ్రాంచ్‌లలో అమలు చేయాలి. ఒక కస్టమర్ దేశంలోని ఏ నగరంలోనైనా, ఏ బ్రాంచ్‌లోనైనా ఒకే రోజు ఒకే మొత్తాన్ని డిపాజిట్ చేస్తే, అతనికి ఒకే వడ్డీ రేటు వర్తించాలి. అదే రోజు, అదే మొత్తానికి వేర్వేరు వడ్డీ రేట్లు ఇవ్వడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పారదర్శకతను మరింత పెంచేందుకు బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్ల ప్రకటనకు కూడా ఆర్‌బీఐ నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించింది. ప్రతి పని దినం ఉదయం 10 గంటలలోపు అన్ని బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్టంగా 10 నిమిషాల సడలింపు మాత్రమే ఇచ్చింది. అంటే ఏ పరిస్థితుల్లోనైనా ఉదయం 10:10 గంటలలోపు వడ్డీ రేట్లను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయడం తప్పనిసరి.
అక్టోబర్ 1 నుంచి అమలు..
అయితే లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్‌సీఆర్) ఫ్రేమ్‌వర్క్ కింద బల్క్ డిపాజిట్లపై పరిమిత స్థాయిలో వడ్డీ రేట్లలో తేడా ఉంచేందుకు బ్యాంకులకు అవకాశం కల్పించింది. కానీ ఆ తేడా బ్యాంకుల ఇష్టానుసారం కాకుండా, బలమైన, సమర్థనీయమైన ఆర్థిక ప్రమాణాల ఆధారంగా మాత్రమే ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. జూన్‌లో విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈ తుది నిబంధనలను రూపొందించింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలతో బ్యాంకు డిపాజిట్లపై కస్టమర్లకు మరింత పారదర్శకమైన, సమానమైన వడ్డీ రాబడి లభించే అవకాశం ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
- ●CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి
- ●Monkey Skull in Bag | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికుడి బ్యాగ్‌లో 'కోతి పుర్రె'
- ●TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
- ●Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం

CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి

Monkey Skull in Bag | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికుడి బ్యాగ్‌లో 'కోతి పుర్రె'






