Telugu Serials | తెలుగు సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్ – గుండె నిండా గుడి గంటలు టాప్ – కార్తీక దీపం 2 డౌన్
తెలుగు సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్‌లో గుండె నిండా గుడి గంటలు అదరగొట్టింది. 11.08తో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ఈ వారం రేటింగ్‌లో టాప్ ఫైవ్ లో అన్ని స్టార్ మా సీరియల్స్ ఉండటం గమనార్హం.
Entertainment | Published On Jun 25, 2026, 8.25 pm IST
Telugu Serials | తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చేశాయి. మరోసారి టాప్ ప్లేస్‌తో స్టార్ మా సీరియల్స్ అదరగొట్టాయి. హయ్యెస్ట్ టీఆర్‌పీ సాధించిన టాప్ ఫైవ్ సీరియల్స్‌లో అన్ని స్టార్ మా ఛానల్‌వే ఉండటం గమనార్హం. ఆరో ప్లేస్‌లో జీ తెలుగు సీరియల్ నిలిచింది.
గుండె నిండా గుడి గంటలు...
లేటెస్ట్ టీఆర్‌పీలో గుండె నిండా గుడి గంటలు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అర్బన్ ఏరియాలో ఈ తెలుగు సీరియల్ 11. 08 రేటింగ్‌ను దక్కించుకుంది. బాలు - మీనా పాత్రల కెమిస్ట్రీతో పాటు ఫ్యామిలీ డ్రామా రక్తికట్టడం గుండె నిండా గుడి గంటలు సీరియల్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. స్టార్ మా సీరియల్స్‌లో ఇదొక్కటే 11 రేటింగ్‌ను దాటింది. మిగిలిన సీరియల్స్ ఏవీ గుండె నిండా గుడి గంటలకు పోటీ ఇవ్వలేకపోయాయి.
పొదరిల్లు...కార్తీక దీపం 2...
గుండె నిండా గుడి గంటలు తర్వాత సెకండ్ ప్లేస్‌ను పొదరిల్లు సీరియల్ సొంతం చేసుకుంది. ఇటీవలే లాంఛ్ అయిన ఈ సీరియల్ టీఆర్‌పీలో దూసుకుపోతుంది. 10.42 రేటింగ్‌తో కుమ్మేసింది. కార్తీక దీపం 2 మూడో ప్లేస్‌ను దక్కించుకుంది. సీరియల్ సాగతీతగా మారడం, ట్విస్ట్‌లు అనుకున్నంతగా వర్కవుట్ కాకపోవడంతో సీరియల్ క్రేజ్ డౌన్ అవుతూ వస్తోంది. లేటెస్ట్ టీఆర్‌పీలో కార్తీక దీపం 2 9.32 రేటింగ్ వచ్చింది.
జీ తెలుగు నుంచి ఒక్కటే...
లేటెస్ట్ రేటింగ్‌లో ఇంటింటి రామాయణం (8.64 ), ఇల్లు ఇల్లాలు పిల్లలు (8.33 )తో పర్వాలేదనిపించాయి. వీటి తర్వాత ప్లేస్‌లో జీ తెలుగు సీరియల్ జగద్దాత్రి నిలిచింది. 8.16 రేటింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఈ సీరియల్ ఆకట్టుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార – గుప్పెడంత మనసు 2 పై అప్డేట్?
ఆగస్టు 1, 2026

Trp Rating | టీఆర్‌పీలో కుమ్మేసిన మన శంకర వరప్రసాద్ గారు – జీ తెలుగులో చిరంజీవి మూవీ రికార్డ్
మార్చి 12, 2026

Star Maa Serials | స్టార్ మా టాప్ ఫైవ్ సీరియల్స్ ఇవే – కార్తీక దీపం 2కు పోటీ లేదు – బ్రహ్మముడి కమ్‌బ్యాక్
ఫిబ్రవరి 20, 2026
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?



