Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ – మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
మెగా హీరో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఆగస్ట్ 7న ఈ హారర్ కామెడీ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.
Entertainment | Published On Jul 10, 2026, 5.57 pm IST
Tollywood | మెగా హీరో వరుణ్ తేజ్ హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది. ప్రయోగాత్మక కథాంశాలతో అతడు చేసిన గత సినిమాలేవి సరైన విజయాలను అందుకోలేదు. ప్రస్తుతం కొరియన్ కనకరాజు పేరుతో ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు వరుణ్‌తేజ్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. కమెడియన్ సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మాస్ లుక్....
కొరియన్ కనకరాజు రిలీజ్ డేట్‌ను మేకర్స్ శుక్రవారం కన్ఫామ్ చేశారు. ఆగస్ట్ 7న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో చేతిలో కత్తి పట్టుకొని లుంగీ ధరించి మాస్ లుక్‌లో వరుణ్ తేజ్ కనిపిస్తున్నారు. అతడి వెనుక కొందరు కొరియన్ వ్యక్తులు గన్నులు పట్టుకొని ఉండటం ఆసక్తిని పంచుతోంది.
చిత్తూరు టూ కొరియా...
ఓ చిత్తూరు యువకుడు కొరియాకు ఎందుకు వెళ్లాడు? గ్యాంగ్‌స్టర్ ఆత్మ అతడిలోకి ఎలా ప్రవేశించిందనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొరియన్ కనరాజు మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కొరియన్ కనకరాజు సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మిరాయ్‌తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రితికా నాయక్ ఏడాది తర్వాత ఈ హారర్ కామెడీ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్...
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్‌లోకి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు మేర్లపాక గాంధీ. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, ఎక్ మినీ కథతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
ప్రస్తుతం కొరియన్ కనరాజుతో పాటు బరి పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న బరి సినిమాకు వరుణ్ తేజ్ సోదరి నిహారిక ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతుంది. ఇటీవలే అఫీషియల్‌గా ఈ మూవీ లాంఛ్ అయ్యింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు – అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ – డైరెక్టర్ ఎవరంటే?
ఆగస్టు 13, 2026

Sukumar Daughter | డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డ్ – ఈ సారి సింగర్‌గా!
ఆగస్టు 13, 2026

Ntr | ఎన్టీఆర్‌కు సర్జరీ – యంగ్ టైగర్ హెల్త్ అప్డేట్ వెల్లడించిన టీమ్
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత



