త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | తగ్గేదేలే… టాలీవుడ్‌లో దూసుకుపోతున్న తెలుగు భామలు… ‘లోకల్’ బ్యూటీల రచ్చ

టాలీవుడ్‌లో అచ్చ తెలుగు హీరోయిన్లు వ‌రుస విజ‌యాల‌తో అద‌ర‌గొడుతోన్నారు. న‌ట‌న‌లో స్టార్ హీరోయిన్ల‌కు తామేం త‌క్కువ కాద‌ని నిరూపిస్తున్నారు.

N

Entertainment | Published On Mar 15, 2026, 1.32 pm IST

Tollywood |  తగ్గేదేలే…  టాలీవుడ్‌లో దూసుకుపోతున్న తెలుగు భామలు… ‘లోకల్’ బ్యూటీల రచ్చ
Advertisement

Tollywood | టాలీవుడ్‌లో ఉత్త‌రాది భామ‌ల‌తో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌ల‌దే హ‌వా క‌నిపిస్తుంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న చాలా మంది క‌థానాయిక‌లు ప‌ర‌భాష‌ల‌కు చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు రాణించ‌లేర‌నే అపోహ చాలా కాలంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ ను తిర‌గ‌రాస్తున్నారు అచ్చ తెలుగు అందాలు. న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌ల‌తో అద‌ర‌గొడుతూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. ఆ హీరోయిన్లు ఎవ‌రంటే?

మానస వారణాసి...

ఇటీవ‌ల రిలీజైన కపుల్ ఫ్రెండ్లీ మూవీతో కెరీర్‌లో తొలి విజ‌యాన్ని అందుకుంది హైద‌రాబాద్ బ్యూటీ మాన‌స వార‌ణాసి. మోడ‌ల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మాన‌స వార‌ణాసి అందాల పోటీల్లో పాల్గొన్న‌ది. మిస్ ఇండియాటైటిల్ గెలుచుకుంది. మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా క‌థానాయ‌కుడిగా న‌టించిన హీరో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా అచ్చిరాలేక‌పోయిన క‌పుల్ ఫ్రెండ్లీతో మెప్పించింది మాన‌స వార‌ణాసి. ఇందులో మిత్ర అనే అమ్మాయిగా ఎమోష‌న‌ల్ రోల్ నాచుర‌ల్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచింది. ఈ విజ‌యంతో టాలీవుడ్ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించిన మాన‌స వార‌ణాసి నాలుగైదు ఆఫ‌ర్లు ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

శివానీ న‌గ‌రం...

టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో అద‌ర‌గొట్టింది అచ్చ తెలుగు హైద‌రాబాదీ అందం శివానీ నగరం. అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి తొలి అడుగు వేసింది. ఆ త‌ర్వాత లిటిల్ హార్ట్స్‌తో పాటు ఇటీవ‌ల రిలీజైన హే బ‌ల్వంత్ సినిమాల్లో అల్ల‌రి అమ్మాయిగా క‌నిపించింది. ఈ మూడు సినిమాలు శివానీ నగారానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. గ్లామ‌ర్ రోల్స్ కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌తో విజ‌యాల‌ను అందుకోవ‌చ్చ‌ని నిరూపిస్తోంది.

బేబీతో ఎంట్రీ...

రెండేళ్ల క్రితం రిలీజైన చిన్న సినిమా బేబీ వంద కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది. ఈ సినిమాలోప్రేమ పేరుతో ఇద్ద‌రు అబ్బాయిల‌ను మోసం చేసే యువ‌తిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది తెలుగు అమ్మాయి వైష్ణ‌వి చైత‌న్య‌. న‌ట‌న విష‌యంలో స్టార్ హీరోయిన్ల‌కు తానేం త‌క్కువ కాద‌ని తొలి సినిమాతోనే చాటిచెప్పింది. బేబీ హిట్‌తో వైష్ణ‌వికి టాలీవుడ్‌లో ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ల‌వ్‌మీ, జాక్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. త్వ‌ర‌లోనే ఎపిక్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది. కోలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

డీ గ్లామ‌ర్ రోల్స్‌...

నార్త్ బ్యూటీల పోటీని త‌ట్టుకుంటూ టాలీవుడ్‌లో చాలా కాలంగా రాణిస్తున్నారు అచ్చ తెలుగు అమ్మాయిలు ఈషారెబ్బా, అన‌న్య నాగ‌ళ్ల. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లో డిఫ‌రెంట్ రోల్స్ చేస్తున్నారు. డీ గ్లామ‌ర్ రోల్స్ లో క‌నిపించారు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ‌లో అన‌న్య నాగ‌ళ్ల ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. ఈషా రెబ్బా హీరోయిన్‌గా న‌టించిన ఓం శాంతి శాంతి శాంతి ఇటీవ‌లే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

సంక్రాంతి సినిమాతో...

స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోన్న డింపుల్ హ‌య‌తికి అదృష్టం క‌లిసిరావ‌డం లేదు. సంక్రాంతికి రిలీజైన ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తిలో ఓ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాలో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో మెప్పించింది. ఈ సినిమా ఆశించిన రిజ‌ల్ట్ ఇవ్వ‌క‌పోయినా డింపుల్ హ‌య‌తి మాత్రం ఖాళీగా లేదు. రెండు సినిమాలు చేస్తోంది.

చిట్టిగా...

జాతిర‌త్నాలు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది ఫ‌రియా అబ్దుల్లా. అమాయ‌క‌త్వం, అల్ల‌రిత‌నం క‌ల‌బోసిన క్యారెక్ట‌ర్‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో చేసిన చిట్టి పాత్ర‌తోనే ఫేమ‌స్ అయ్యింది. జాతిర‌త్నాలు త‌ర్వాత చాలానే సినిమాలు చేసింది ఫ‌రియా అబ్దుల్లా. ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న సిగ్మా మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
వీరే కాకుండా రాజ‌శేఖ‌ర్‌, జీవిత త‌న‌య‌లు శివానీ, శివాత్మిక తెలుగు కంటే త‌మిళంలో ఎక్కువ‌గా సినిమాలు చేస్తోన్నారు. కోర్టు మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రీదేవి ప్ర‌స్తుతం బ్యాండుమేళం మూవీతో వెండితెర‌పై త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకోబోతున్న‌ది. వీరే కాకుండా మ‌రికొంద‌రు అచ్చ తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

 

Advertisement
Advertisement