త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thriller OTT | ఓటీటీలోకి ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ – ఐదు భాష‌ల్లో రిలీజ్‌

త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన‌ సిగ్మా మూవీ థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Oct 27, 2026, 2.08 pm IST

Thriller OTT  | ఓటీటీలోకి ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ  –  ఐదు భాష‌ల్లో రిలీజ్‌
Advertisement

Thriller OTT | త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy vijay) త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ (Jason Sanjay) సిగ్మా మూవీతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సందీప్ కిష‌న్ హీరోగా న‌టించాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించింది. ఫ‌రియా అబ్దుల్లా క‌థానాయిక‌గా క‌నిపించింది.

చిరంజీవి, సూర్య‌...

జాస‌న్ సంజ‌య్ డెబ్యూ మూవీ కావ‌డంతో రిలీజ్‌కు ముందు సిగ్మాపై త‌మిళంతో పాటు తెలుగునాట భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. విజ‌య్‌పై ఉన్న అనుబంధం, అభిమానంతో చిరంజీవి, సూర్య‌తో పాటు ప‌లువురు స్టార్ హీరోలు సిగ్మా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్నారు. రెండు భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ప‌ది కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇర‌వై శాతం కూడా రిక‌వ‌రీ సాధించ‌లేక‌పోయింది.

నెల రోజుల్లోనే...

తాజాగా థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే సిగ్మా ఓటీటీలోకి (OTT) వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ...మొత్తం ఐదు భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

ఔట్‌డేటెడ్ స్టోరీ...

సిగ్మా మూవీలో రాజు సుంద‌రం, సంప‌త్‌రాజ్‌, శివ్ పండిట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కేథ‌రిన్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. ఔట్‌డేటెడ్ స్టోరీలైన్‌తో పాటు స్క్రీన్‌ప్లేలో ఉత్కంఠ‌లోపించ‌డం, లాజిక్‌లెస్ సీన్ల కార‌ణంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

గురు...

గురు ఓ చిన్న లైబ్ర‌రీ న‌డుపుకుంటూ బ‌తుకుతుంటాడు. కోటి వ‌ర‌కు అప్పులు అవుతాడు. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా వెయ్యి కోట్ల న‌గ‌దు ఉన్న ఓ కంటైన‌ర్ గురించి తెలుస్తుంది. ఆ కంటైన‌ర్ కోసం వీర‌య్య, విన్సెంట్ గ్యాంగ్‌లు వెతుకుంటాయి. అస‌లు ఆ డ‌బ్బు ఎవ‌రిది? వీర‌య్య‌, విన్సెంట్‌ల‌ను బురిడీ కొట్టించి గురు ఆ వెయ్యి కోట్లు సొంతం చేసుకున్నాడా? ఈ ప్లాన్‌లో గురుకు సాయం చేసిన ఆర్జే సామ్ ఎవ‌రు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement