Vaishnavi Chaitanya | టాలీవుడ్‌కు బ్రేక్ – కోలీవుడ్‌పై కన్నేసిన బేబీ హీరోయిన్ – రొమాంటిక్ జానర్‌లో డెబ్యూ మూవీ
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)రూటు మార్చింది. వరుస డిజాస్టర్లతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. హీరో ఆర్యతో ఓ రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తోంది. వైష్ణవి చైతన్య డెబ్యూ మూవీకి హలో కాదల్ అనే టైటిల్ ఖరారైంది.
Entertainment | Published On Oct 11, 2026, 3.08 pm IST
Vaishnavi Chaitanya | బేబీ సినిమాతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది వైష్ణవిచైతన్య(Vaishnavi Chaitanya). పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటనకు చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్లు సైతం ఫిదా అయ్యారు. టాలీవుడ్‌కు మంచి హీరోయిన్ దొరికిందంటూ ప్రశంసలు కురిపించారు. బేబీ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో లవ్ మీ, జాక్ సినిమాలు చేసింది వైష్ణవి చైతన్య. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
బోల్డ్ రోల్‌లో...
దాంతో తన పంథా మార్చి రొమాంటిక్ జానర్‌లో ఎపిక్ (Epic Movie) సినిమా చేసింది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా కూడా వైష్ణవి చైతన్యకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. ఈ డిజాస్టర్లతో టాలీవుడ్‌లో వైష్ణవిచైతన్య జోరుకు బ్రేకులు పడ్డాయి. ఎపిక్ తర్వాత తెలుగులో కొత్త సినిమా ఏది అంగీకరించలేదు. ఆఫర్లు తగ్గడంతో కోలీవుడ్ బాట పట్టింది.
హలో కాదల్...
సైలెంట్‌గా ఓ సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తోన్నాడు. ఈ సినిమాకు హలో కాదల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆర్య సినిమాతోనే కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య ఎంట్రీ ఇస్తోంది. ఇందులో నిఖిలా విమల్ మరో నాయికగా కనిపించబోతుంది.
మలయాళ డైరెక్టర్...
మలయాళ మూవీ ప్రణయ విలాసం ఫేమ్ నిఖిల్ మురళీ దర్శకత్వం వహిస్తున్న హలో కాదల్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. మోడ్రన్ అమ్మాయిగా బోల్డ్ రోల్‌లో వైష్ణవి చైతన్య కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం తమిళం నేర్చుకున్న వైష్ణవిచైతన్య సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌లో ఈ అచ్చ తెలుగు బ్యూటీ తమిళ డెబ్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
అఖిల్ హీరోయిన్....
హలో కాదల్ సినిమాను హీరో ఆర్య వైఫ్ సయేషా నిర్మించబోతుంది. సయేషా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న తొలి సినిమా ఇది. గతంలో సయేషా అఖిల్ అక్కినేని డెబ్యూ మూవీ అఖిల్‌లో కథానాయికగా కనిపించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shruti Haasan | రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా సినిమా – శోభిత ధూళిపాళ తమిళ మూవీలో శృతి హాసన్ గెస్ట్ రోల్!
అక్టోబర్ 10, 2026

Indian 3 Movie | ‘భారతీయుడు3’కి లైన్ క్లియర్ – తిరిగి సెట్స్‌పైకి కమల్‌హాసన్ మూవీ – ముగ్గురు హీరోయిన్లతో
అక్టోబర్ 8, 2026

Sai Pallavi | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన సాయిపల్లవి – కానీ కండీషన్స్ అప్లై
అక్టోబర్ 8, 2026
తాజావార్తలు
- ●Sharannavaratri | ఇంద్రకీలాద్రికి శరన్నవరాత్రి శోభ.. తొలిరోజు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
- ●Revanth Reddy | గోయ్ రాఖోన్న్ యాత్ర.. గోవా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
- ●Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ - క్రైమ్ కామెడీగా 'తులాభారం'
- ●Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు
- ●Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..
- ●Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే

Sharannavaratri | ఇంద్రకీలాద్రికి శరన్నవరాత్రి శోభ.. తొలిరోజు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

Revanth Reddy | గోయ్ రాఖోన్న్ యాత్ర.. గోవా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి

Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ - క్రైమ్ కామెడీగా 'తులాభారం'

Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు



