Ubs Collections | ఉస్తాద్ భగత్‌సింగ్ వర్సెస్ ధురంధర్ 2 – ఫస్ట్ డే కలెక్షన్స్‌లో బాలీవుడ్ హీరోను బీట్ చేసిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ తొలిరోజే యాభై రెండు కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చచేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. నైజాంలో మాత్రం పవన్ కళ్యాణ్ మూవీ డిసపాయింట్ చేసింది.
Entertainment | Published On Mar 20, 2026, 4.42 pm IST
Ubs Collections | పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. తొలిరోజే యాభై కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. ధురంధర్ 2 మూవీని దాటేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్‌తో పాటు సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్....
గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ తొలిరోజే 52. 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో రచ్చచేసింది. వరల్డ్ వైడ్‌గా 32 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ డే 24 శాతం రికవరీ సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లోకి అడుగుపెట్టాలంటే ఇంకో వంద కోట్ల వసూళ్లను సాధించాల్సివుందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
రెట్టింపు వసూళ్లతో...
తెలుగు రాష్ట్రాల్లో గురువారం రోజు ఉస్తాద్ భగత్‌సింగ్ 52 కోట్ల కలెక్షన్స్ దక్కించుకోగా...ధురంధర్ 2 హిందీ, తెలుగు వెర్షన్స్ కలిపి 25 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ మూవీకి రెట్టింపు వసూళ్లతో పవన్ కళ్యాణ్ మూవీ అదరగొట్టింది.
నైజాంలో మైనస్...
నైజాంలో మాత్రం మొదటి రోజు ఉస్తాద్ భగత్‌సింగ్ అంచనాలకు తగ్గట్లుగా కలెక్షన్స్ సాధించలేక నిరాశపరిచింది. టికెట్ రేట్ హైక్స్‌తో పాటు బెనిఫిట్ షోలకు తెలంగాణలో అనుమతి రాలేదు. దాంతో రెగ్యులర్ ధరలతోనే ఈ సినిమా రిలీజైంది. తొలిరోజు నైజాంలో ఏడున్నర కోట్ల వరకు మాత్రమే వసూళ్లను దక్కించుకుంది.
పవన్ మ్యానరిజమ్స్...
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, డైలాగ్స్ తో పాటు పాత సినిమాల రిఫరెన్స్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కానీ కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్, తమన్ మ్యూజిక్ అందించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



