Ustaad Bhagat Singh OTT | ఉస్తాద్‌భగత్‌సింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – స్ట్రీమింగ్ డేట్ చెప్పేసిన ప్రొడ్యూసర్
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఉస్తాద్ భగత్‌సింగ్ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా నిర్మాతలు రివీల్ చేశారు.
Entertainment | Published On Mar 19, 2026, 5.24 pm IST
Ustaad Bhagat Singh OTT | మార్చిలో పెద్ద సినిమాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్‌సింగ్‌తో మళ్లీ కళకళలాడింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ ఉగాది సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలి రోజు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ టాక్‌తో సంబంధం లేకుండా ఉస్తాద్ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించే మూవీగా ఉస్తాద్ నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.
నెట్‌ఫ్లిక్స్...
కాగా ఉస్తాద్ భగత్‌సింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఎనభై కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు వార్తలొచ్చాయి. కాగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను నిర్మాత రివీల్ చేశారు. ఏప్రిల్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు.
పవన్ మ్యానరిజమ్స్, డైలాగ్స్...
ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్, తమన్ మ్యూజిక్ అందించారు.
పవన్ కళ్యాణ్ ఇమేజ్, స్టార్‌డమ్‌ను నమ్ముకొని కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ మ్యానరిజమ్స్, ఆయన డైలాగ్స్, హీరోయిజం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పాత సినిమాల తాలూకు రిఫరెన్స్‌లు బాగున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ కథ, కథనాల్లో కొత్తదనం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



