త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Urfi Javed | న‌న్ను బ‌త‌క‌నివ్వ‌రా? – సోష‌ల్‌ మీడియా వేధింపులపై ఉర్ఫీ జావెద్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

సోష‌ల్ మీడియా వేధింపుల‌పై బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ ఎమోష‌న‌ల్ అయ్యింది. త‌న‌ను చంపేస్తామ‌ని బెదిరిస్తున్నర‌ని అన్న‌ది. అస‌భ్య‌పు కామెంట్ల‌తో దూషిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా ఇటీవ‌ల ముగిసిన ది ట్రైట‌ర్ షోలో నికితా లూథ‌ర్‌తో క‌లిసి ఉర్ఫీ జావెద్ విన్న‌ర్‌గా నిలిచింది.

N

Entertainment | Published On Jun 11, 2026, 3.02 pm IST

Urfi Javed | న‌న్ను బ‌త‌క‌నివ్వ‌రా? – సోష‌ల్‌ మీడియా వేధింపులపై ఉర్ఫీ జావెద్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌
Advertisement

Urfi Javed |  సోష‌ల్ మీడియా వేధింపుల‌పై బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, టీవీ స్టార్ ఉర్ఫీ జావెద్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. త‌న‌ను రేప్ చేస్తామ‌ని, చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చాలా దారుణ‌మైన కామెంట్ల‌తో మాన‌సికంగా హింసిస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌....

అమెజాన్ ప్రైమ్‌లో టెలికాస్ట్ అయిన "ది ట్రైట‌ర్స్" రియాలిటీ షో సీజ‌న్ వ‌న్ విజేత‌గా నికితా లూథ‌ర్‌తో క‌లిసి ఉర్ఫీ జావేద్ నిలిచింది. ఇద్ద‌రికీ క‌లిపి 70 ల‌క్ష‌ల‌కుపైగా ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ షోలో రాజ్ కుంద్రా, ల‌క్ష్మి మంచు, క‌ర‌ణ్ కుంద్రా, ఆశీష్ విద్యార్థితో పాటు ప‌లువురు సెలిబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. మైండ్ గేమ్ ఆధారంగా సాగిన ఈ షోలో వారంద‌రిని దాటేసి చివ‌ర‌కు ఉర్ఫీ జావేద్‌, నికితా లూథ‌ర్ విజేత‌లుగా నిలిచారు.

చంపేస్తామంటున్నారు...

ఈ షోలో విన్న‌ర్‌గా నిలిచిన త‌ర్వాత వేధింపులు పెరిగిపోయాన‌ని ఉర్ఫీ జావెద్ చెప్పింది. "సోష‌ల్ మీడియాలో చెప్ప‌రాని భాష‌లో నాపై అస‌భ్యంగా కామెంట్లు చేస్తున్నారు. చంపేస్తామ‌ని, రేప్ చేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని" అన్న‌ది. త‌న‌పై వ‌చ్చిన ఓ అస‌భ్య కామెంట్ల తాలూకు స్క్రీన్ షాట్స్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. "ఇది ఒక్క శాతం మాత్ర‌మే. ఇంత‌కంటే దారుణంగా ప్ర‌తి రోజు న‌న్ను ట్రోల్ చేస్తున్నారు. దారుణ‌మైన భాష‌లో నీచంగా కామెంట్లు పెడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో కూడా తెలియ‌డం లేదు. ట్రోల్స్‌ను త‌ట్టుకొని నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌వుతోంది. ఈ పోరాటంలో రోజురోజుకు ధైర్యాన్ని కోల్పోతున్నాను" అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

నిత్య‌కృత్యంగా మారింది...

త‌న ఒక్క‌దానికే కాకుండా సోష‌ల్ మీడియాలో మ‌హిళ‌లంద‌రి ప‌రిస్థితి దాదాపు ఇలాగే ఉంద‌ని, అస‌భ్యపు కామెంట్లు, బూతులు ఎదుర్కోవ‌డం నిత్య‌కృత్యంగా మారిపోయిందని ఉర్ఫీ జావెద్ అన్నది.  ఆమె పోస్ట్ వైర‌ల్ అవుతోంది. ఉర్ఫీ జావెద్‌కు స‌పోర్ట్‌గా ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు. సీరియ‌ల్ యాక్ట‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఉర్ఫీ జావెద్ బిగ్‌బాస్ సీజ‌న్ 11, ఎమ్‌టీవీ స్పిట్‌విల్లా వంటి రియాలిటీ షోస్‌తో ఫేమ‌స్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో త‌ర‌చుగా హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను క‌వ్విస్తుంటుంది.

 

 

Advertisement
Advertisement