త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ananya Panday | సినిమా ఛాన్స్‌లు నిల్ – లైగ‌ర్ హీరోయిన్ ఆశ‌ల‌న్నీ క‌ర‌ణ్ జోహార్ వెబ్‌సిరీస్ పైనే!

రెండేళ్ల క్రితం విడుద‌లైన "కాల్ మీ బే" వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది లైగ‌ర్ హీరోయిన్ అన‌న్యా పాండే. ఈ హిందీ సిరీస్‌లో బెల్లా చౌద‌రి పాత్రలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా "కాల్ మీ బే" వెబ్‌సిరీస్‌కు సీజ‌న్ 2 రాబోతుంది. డిసెంబ‌ర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. కాల్ మీ బే 2లో అన‌న్యా పాండేతో పాటు శృతి హాస‌న్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.

N

Entertainment | Published On Nov 17, 2026, 5.38 pm IST

Ananya Panday | సినిమా ఛాన్స్‌లు నిల్ – లైగ‌ర్ హీరోయిన్ ఆశ‌ల‌న్నీ క‌ర‌ణ్ జోహార్ వెబ్‌సిరీస్ పైనే!
Advertisement

Ananya Panday |  లైగ‌ర్ బ్యూటీ అన‌న్యా పాండే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఏడేళ్లు దాటిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్‌తో పాటు తెలుగులో ప‌ధ్నాలుగు సినిమాలు చేసింది. ఇందులో స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, డ్రీమ్ గ‌ర్ల్ 2 మిన‌హా మిగిలిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. థియేట్రిక‌ల్ సినిమాలు అచ్చిరాక‌పోవ‌డంతో రెండేళ్ల క్రితం రిలీజైన "కాల్ మీ బే" వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

అమెజాన్ ప్రైమ్‌లో

అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ వెబ్‌సిరీస్‌లో బెల్లా చౌదరి అలియాస్ బే అనే పాత్రలో పరిణతితో కూడిన నటనను కనబరిచింది అనన్యా పాండే. గొప్పింటి కుటుంబంలో పుట్టి పెరిగి అనుకోని పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వ కూడా లేని స్థితిలోకి చేరుకునే అమ్మాయిగా ఈ వెబ్‌సిరీస్‌లో అన‌న్యా పాండే క‌నిపించింది. క‌ష్టాలు, క‌న్నీళ్ల‌ను దిగ‌మింగుకుంటూ మ‌నోధైర్యంతోజీవితంలో ముందుకు సాగ‌డ‌మే కాకుండా జ‌ర్న‌లిస్ట్‌గా ఉద్యోగం చేస్తూ ఓ పెద్ద స్కామ్‌ను బెల్లా చౌద‌రి ఎలా బ‌య‌ట‌పెట్టింద‌నే అంశాల‌తో ద‌ర్శ‌కుడు కోలిన్ డి కున్హా ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు.

ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ

"కాల్ మీ బే" వెబ్‌సిరీస్‌కు సీజ‌న్ 2 రాబోతుంది. కార్పొరేట్ మోసాల‌కు ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీని జోడిస్తూ ఈ సెకండ్ సీజ‌న్ తెర‌కెక్కుతోంది. డిసెంబ‌ర్ 17 నుంచి సెకండ్ సీజ‌న్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ అన‌న్యా పాండే పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది.

శృతి హాస‌న్

కాల్ మీ బే సెకండ్ సీజ‌న్‌లో శృతి హాస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఆమె రోల్ ఏమిట‌న్న‌ది మేక‌ర్స్ స‌స్పెన్స్‌గా దాచిపెట్టారు. ఈ హిందీ వెబ్‌సిరీస్‌లో వీర్‌దాస్, గుర్‌ఫ‌తే ఫిర్జాదా, వ‌రుణ్ సుద్‌, నిహారిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. క‌ర‌ణ్ జోహార్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించారు.

 

Advertisement
Advertisement