Malayalam OTT | భాగమతి హీరో మలయాళం రొమాంటిక్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ – రన్‌టైమ్ గంటన్నరే
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మలయాళం రొమాంటిక్ మూవీ మిండియుమ్ పరంజుమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఫిబ్రవరి 6న సన్ నెక్స్ట్ ద్వారా ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటించింది.
Entertainment | Published On Feb 2, 2026, 7.34 pm IST
Malayalam OTT | మలయాళం హీరో ఉన్ని ముకుందన్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత భాగమతి, యశోద, ఖిలాడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగులో నెగెటివ్ రోల్స్ ఎక్కువగా చేసిన ఉన్ని ముకుందన్ మలయాళంలో మాత్రం టాప్ హీరోగా కొనసాగుతోన్నాడు. అతడు కథానాయకుడిగా నటించిన మలయాళం మూవీ మిండియుమ్ పరంజుమ్ ఓటీటీలోకి రాబోతుంది.
ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మలయాళం సినిమా ఫిబ్రవరి 6 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.
అపర్ణ బాలమురళి...
మిండియుమ్ పరంజుమ్ సినిమాలో అపర్ణబాలమురళి హీరోయిన్గా నటించింది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు అరుణ్ బోస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మలయాళ డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఓ కీలక పాత్రలో కనిపించాడు.
గంటన్నర నిడివి...
గత ఏడాది డిసెంబర్లో మిండియుమ్ పరంజుమ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. కేవలం గంటన్నర రన్టైమ్తో డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించారు. మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని సాధించలేదు. ఉన్ని ముకుందన్, అపర్ణ బాలమురళి కెమిస్ట్రీ, వారిద్దరి మధ్య లవ్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. మధు అంబాట్ సినిమాటోగ్రఫీకి ప్రశంసలు దక్కాయి.
ఉద్యోగం కోసం...
సనాల్, లీనా ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకుంటారు. పెళ్లి తర్వాత అనుకోకుండా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాల్సివస్తుంది సనాల్. దాంతో భార్యకు దూరం అవుతాడు. ఈ గ్యాప్ వారిద్దరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది? సనాల్, లీనా ప్రేమ మరింత గాఢంగా ఎలా మారింది అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Nidhhi Agerwal | మలయాళంలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్ – మైథాలజీ సినిమాలో హీరోయిన్గా!
నవంబర్ 22, 2026

Malayalam OTT | ఓటీటీలోకి మమ్ముట్టి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – లైంగిక వేధింపులతో రిలీజ్‌కు ముందు డైరెక్టర్ అరెస్ట్
నవంబర్ 17, 2026

Ritika Singh | ఐటెంసాంగ్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ – మెగాస్టార్‌తో స్టెప్పులు
నవంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



