త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి మ‌మ్ముట్టి మ‌ల‌యాళ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – లైంగిక వేధింపుల‌తో రిలీజ్‌కు ముందు డైరెక్ట‌ర్ అరెస్ట్‌

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి గెస్ట్‌రోల్‌లో న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎల్ఏ (లా అండ్ ఆర్డ‌ర్) బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 89 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Nov 17, 2026, 8.16 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి మ‌మ్ముట్టి మ‌ల‌యాళ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – లైంగిక వేధింపుల‌తో రిలీజ్‌కు ముందు డైరెక్ట‌ర్ అరెస్ట్‌
Advertisement

Malayalam OTT | ఈ ఏడాది మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా ఎల్ఏ ( అండ్ ఆర్డ‌ర్) మూవీ నిలిచింది. మ‌మ్ముట్టి గెస్ట్ రోల్‌లో న‌టించిన సినిమా కావ‌డంతో రిలీజ్‌కు ముందు ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీపై అభిమానుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. మూడు నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకున్న మ‌ల‌యాళ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రంజిత్ లా అండ్ ఆర్డ‌ర్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కాష్ వ‌ర్మ‌, జాయ్ మాథ్యూ, సురేష్ కృష్ణ‌, అభిరామి కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌ల‌యాళంలో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన ఉద‌య్ కృష్ణ లా అండ్ ఆర్డ‌ర్‌కు క‌థ‌ను అందించారు.

89 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్‌...

సెప్టెంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మొద‌టి రోజు థియేట‌ర్ల‌లో కేవ‌లం 33 ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. మొత్తంగా థియేట‌ర్ల‌లో 89 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్రమే ద‌క్కించుకొని చెత్త సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా క‌థ‌, ప్ర‌ధాన పాత్ర‌ధారుల న‌ట‌న‌తో పాటు మ‌మ్ముట్టి గెస్ట్ రోల్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. మ‌మ్ముట్టి హీరోగా 2004లో రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన బ్లాక్ సినిమాలోని క‌రిక్క‌మూరి ష‌ణ్ముగం పాత్ర‌ను ఈ సినిమా కోసం మ‌రోసారి క్రియేట్ చేశారు.

ఓటీటీలోకి...

లా అండ్ ఆర్డ‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. . ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ త్వ‌ర‌లోనే మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. న‌వంబ‌ర్ 27న రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

లైంగిక వేధింపులు...

లా అండ్ ఆర్ట‌ర్ రిలీజ్ టైమ్‌లో ద‌ర్శ‌కుడు రంజిత్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఓ న‌టి ఫిర్యాదుతో అత‌డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోప‌ణ‌లు కూడా సినిమా క‌లెక్ష‌న్స్ త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి.
డ్ర‌గ్స్ మాఫియా చుట్టూ లా అండ్ ఆర్డ‌ర్ క‌థ సాగుతుంది. త‌న కొడుకు మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

 

Advertisement
Advertisement