త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ulka Gupta | తెలుగు సినిమాలో కేర‌ళ స్టోరీ 2 హీరోయిన్ – ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత రీఎంట్రీ

కేర‌ళ స్టోరీ 2 హీరోయిన్ ఉల్కా గుప్తా దాదాపు ప‌ద‌కొండేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ అగ‌ధ‌లో ఓ హీరోయిన్‌గా ఉల్కా గుప్తా న‌టించ‌బోతున్న‌ది. ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Apr 27, 2026, 2.59 pm IST

Ulka Gupta | తెలుగు సినిమాలో కేర‌ళ స్టోరీ 2 హీరోయిన్ – ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత రీఎంట్రీ
Advertisement

Ulka Gupta | ఇటీవ‌ల రిలీజైన వివాదాస్ప‌ద సినిమా కేర‌ళ స్టోరీ 2లో ఓ హీరోయిన్‌గా న‌టించింది ఉల్కా గుప్తా. ల‌వ్ జిహాద్ కార‌ణంగా బ‌లైన అమాయ‌క యువ‌తిగా అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ బీహార్ బ్యూటీ ఓ తెలుగు సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సీనియ‌ర్ ద‌ర్శ‌క‌నిర్మాత ఎంఎస్ రాజు అగ‌ధ పేరుతో ఓ మైథ‌లాజిక‌ల్ డివైన్ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు. ఇటీవ‌లే ఈ పాన్ ఇండియ‌న్ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో ఉల్కా గుప్తా ఓ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ సోమ‌వారం ప్ర‌క‌టించారు. ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. అగ‌ధ‌లో మ‌హిమ అనే క్యారెక్ట‌ర్‌లో ఉల్కా గుప్తా క‌నిపించ‌బోతున్న‌ది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూస్తుంటే ఈ సినిమాలో ఓ ఇంటెన్స్ క్యారెక్ట‌ర్‌లో ఆమె న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఆంధ్రా పోరి...

ఉల్కా గుప్తాకు అగ‌ధ ఫ‌స్ట్ తెలుగు మూవీ కాదు. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ జ‌ర్నీ టాలీవుడ్‌తోనే మొద‌లైంది. పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టించిన ఆంధ్రా పోరి లో ఉల్కా గుప్తా హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతోనే ఫ‌స్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చింది. ఆ త‌ర్వాత అనుష్క రుద్ర‌మ‌దేవిలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది.

ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత‌..̣.

హిందీ బుల్లితెర‌పై స్టార్‌గా వెలుగొందుతోన్న ఉల్కా గుప్తా...ర‌ణ‌వీర్‌సింగ్ సింబాతో మ‌రికొన్ని బాలీవుడ్ సినిమాల్లో క‌నిపించింది. తాజాగా అగ‌ధ‌తో ప‌ద‌కొండేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది.
అగ‌ధ మూవీలో శ్ర‌వ‌ణ్ రెడ్డి, కామాక్షి భాస్క‌ర్ల కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 85 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్‌ను జరిపార‌ట‌. ఇందులో న‌ల‌భై ఐదు నిమిషాల‌కుపైగా ఉంటే వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ స‌న్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉంటాయ‌ట‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుతున్నామ‌ని, త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు. అగ‌ధ మూవీకి రాకేష్ వెంక‌టాపురం మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Advertisement
Advertisement