త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rustum | చిరంజీవి టైటిల్‌తో హ‌నుమాన్ నిర్మాత‌ల సినిమా – హీరో ఎవ‌రంటే?

మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌తో హ‌నుమాన్ నిర్మాత‌లు ఓ సినిమా చేయ‌బోతున్నారు. రుస్తుం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో నాగ‌బంధం, పెద‌కాపు సినిమాల ఫేమ్ విరాట్ హీరోగా న‌టిస్తున్నాడు.

N

Entertainment | Published On Nov 27, 2026, 7.35 pm IST

Rustum | చిరంజీవి టైటిల్‌తో హ‌నుమాన్ నిర్మాత‌ల సినిమా – హీరో ఎవ‌రంటే?
Advertisement

Rustum |  మెగాస్టార్ చిరంజీవికి యాక్ష‌న్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన సినిమాల్లో రుస్తుం ఒక‌టి. ఈ ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో టాలీవుడ్ యంగ్ హీరో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. పెద‌కాపు, నాగ‌బంధం సినిమాల ఫేమ్ విరాట్ క‌ర్ణ హీరోగా రుస్తుం టైటిల్‌లో ఓ సినిమా రాబోతుంది. హ‌నుమాన్‌తో సినిమాతో నిర్మాత‌లుగా పెద్ద విజ‌యాల‌ను అందుకున్న నిరంజ‌న్‌రెడ్డి, చైత‌న్య‌రెడ్డి ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు.

యానిమేష‌న్‌లో..

విరాట్ క‌ర్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుక్ర‌వారం రుస్తుం సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు క‌నిష్క గంధం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. పోర్ట్‌, మార్కెట్‌, బ‌స్తీతో పాటు కాళికా మాత విగ్ర‌హం ముందు హీరో నిల్చొని ఉండ‌టం, అత‌డికి ఎదురుగా వంద‌లాది మంది శ‌త్రువులు ఉన్న‌ట్లుగా ఈ గ్లింప్స్‌లో చూపించారు. యానిమేష‌న్‌లో సాగిన గ్లింప్స్ విజువ‌ల్స్‌, బీజీఎమ్ ఆక‌ట్టుకుంటున్నాయి.

త్వ‌ర‌లో అప్‌డేట్స్‌...

రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా ‘రుస్తుం’ ఉండ‌బోతున్న‌ట్లు చూపించారు. త్వ‌ర‌లోనే రుస్తుం నుంచి మ‌రిన్ని అప్‌డేట్స్ వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు. నాగ‌బంధం త‌ర్వాత విరాట్ క‌ర్ణ హీరోగా న‌టిస్తోన్న మూవీ ఇది.

 

Advertisement
Advertisement