త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepika Padukone | సోన‌మ్ వాంగ్‌చుక్‌కు దీపికా ప‌డుకోణ్ మ‌ద్ద‌తు – సోష‌ల్ మీడియాలో ర‌చ్చ – అస‌లు ట్విస్ట్ ఇదే?

నీట్ పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంపై ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ విద్యా వేత్త సోన‌మ్ వాంగ్ చుక్ చేస్తోన్న నిరాహార దీక్ష‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌డుకోణ్ మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. సోన‌మ్‌కు స‌పోర్ట్ చేస్తూ దీపికా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. ఈ పోస్ట్ వెన‌కున్న అస‌లు ట్విస్ట్ ఏంటంటే?

N

Entertainment | Published On Jul 16, 2026, 4.17 pm IST

Deepika Padukone | సోన‌మ్ వాంగ్‌చుక్‌కు దీపికా ప‌డుకోణ్ మ‌ద్ద‌తు  – సోష‌ల్ మీడియాలో ర‌చ్చ –  అస‌లు ట్విస్ట్ ఇదే?
Advertisement

Deepika Padukone |  నీట్ పేప‌ర్ లీకేజీపై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో విద్యా వేత్త సోన‌మ్ వాంగ్ చుక్ చేస్తోన్న నిరాహార దీక్ష‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌డుకోణ్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిందంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ బాలీవుడ్ హీరోయిన్ పెట్టిన‌ట్లుగా చెబుతోన్న ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోష‌ల్ మీడియాతో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. సోన‌మ్ నిరాహార దీక్ష‌కు దీపికా ప‌డుకోణ్ స‌పోర్ట్ చేయ‌డం సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. బాలీవుడ్ నుంచి ఒక‌రిద్ద‌రు చిన్న న‌టీన‌టులు మిన‌హా స్టార్స్ ఎవ‌రూ సోన‌మ్ దీక్ష‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌లేదు. అలాంటి టైమ్‌లో దీపికా స‌పోర్ట్ చేయ‌డంపై ర‌క‌ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దీపికా ఎందుకిలా చేసింది? ఆ పోస్ట్ వెనుక ఎవ‌రున్నారు? ప్ర‌ధానిని విమ‌ర్శించే ధైర్యం ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌ని కామెంట్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. చాలా మంది నెటిజ‌న్లు ఆమె ఇన్‌స్టా స్టోరీని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ పోస్ట్‌లో ఏముందంటే?

దీపికా పెట్టిన పోస్ట్‌లో "సోన‌మ్ దీక్ష గురించి మాట్లాడటానికి అంద‌రూ ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు. ఆయ‌న న్యాయం కోసం ఉప‌వాసం చేస్తున్నారు. మ‌నం మాత్రం సోష‌ల్ మీడియాలో స్క్రోల్స్ చూస్తూ, పోస్ట్‌లు పెడుతూ ఏం ప‌ట్ట‌న‌ట్లుగా ఉంటున్నాం. ఓ విఫ‌ల నాయ‌కుడిని గొప్ప‌గా చూపిస్తూ ఎన్నో సినిమాలు వ‌స్తున్నాయి. వాటివ‌ల్ల వాస్త‌వాలు మారిపోవు. ప్ర‌జాస్వామ్యంలో అత్యంత చీక‌టి రోజుల్లో బ‌తుకుతున్నాం"అంటూ దీపికా ప‌డుకోణ్ త‌న పోస్ట్‌లో పేర్కొన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆ త‌ర్వాత డిలీట్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

అస‌లు ట్విస్ట్ ఇదే...

దీపికా ప‌డుకోణ్ పోస్ట్ వెనుక అస‌లు ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డింది. సోన‌మ్ వాంగ్‌చుక్ దీక్ష‌కు మ‌ద్ద‌తుగా దీపికా సోష‌ల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్ట‌లేదు. దీపికా పేరుతో ఫేక్ ఇన్‌స్టాపోస్ట్‌ను క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ న‌కిలీ పోస్ట్‌పై ఈ బాలీవుడ్ హీరోయిన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీపికా అలాంటి పోస్ట్ ఏం పెట్ట‌లేద‌ని, అస‌త్యాల్ని, అబ‌ద్ద‌పు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేయ‌ద్ద‌ని పేర్కొన్నారు. ఇక‌నైనా ఈ ఫేక్ వార్త‌ల‌కు పుల్‌స్టాప్ పెడితే మంచిదంటూ తెలిపారు.

ధురంధ‌ర్ 2లో...

గ‌తంలో భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన ధురంధ‌ర్ 2 మూవీకి దీపికా ప‌డుకోణ్ నెగెటివ్ రివ్యూ ఇచ్చిన‌ట్లుగా పెట్టిన ఓ పోస్ట్ కూడా ఇలాగే వైర‌ల్ అయ్యింది. సినిమాలోని రాజ‌కీయ అంశాల‌న్నీ క‌ల్పితాలంటూ, నిజాల‌ను వ‌క్రీక‌రించిన ఆ సినిమా తీశారంటూ ఈ పోస్ట్‌లో దీపికా ప‌డుకోణ్ పేర్కొన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. చివ‌ర‌కు ఆ ఫేక్ ట్వీట్‌ఫై ఈ బాలీవుడ్ బ్యూటీనే స్వ‌యంగా రియాక్ట్ అయ్యింది. ఇప్పుడు సోన‌మ్ దీక్ష‌కు సంబంధించిన ప్ర‌చారం అవుతోన్న ఈ న‌కిలీ పోస్ట్‌ఫై దీపికా రియాక్ట్ అవుతుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

Advertisement
Advertisement