Asha Bhosle | లతా మంగేష్కర్‌తో ఆశా భోస్లే గొడవలపై వచ్చిన బాలీవుడ్ మూవీ ఇదే…
బాలీవుడ్ అశా భోస్లేతో పాటు ఆమె సోదరి లతా మంగేష్కర్ కూడా దిగ్గజ గాయనీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. లతా మంగేష్కర్ కారణంగాపూ ఆశా సింగర్‌గా మారారు. అయితే లతా మంగేష్కర్‌తో ఆశా భోస్లేకు మధ్య మాత్రం సరైన సంబంధాలు ఉండేవి కావట. వీరి మధ్య గొడవల ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా వచ్చింది...
Entertainment | Published On Apr 12, 2026, 3.59 pm IST
Asha Bhosle | ఆశా భోస్లే తో ఆమె సోదరి లతా మంగేష్కర్ కూడా బాలీవుడ్‌లో లెజెండరీ సింగర్‌గా కొనసాగారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఫిమేల్ సింగర్స్ అంటే వీరిద్దరి పేరు మాత్రమే వినిపించేది. లతా మంగేష్కర్ లేదంటే ఆశా భోస్లే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు పాడాల్సిందే అన్నంతగా బాలీవుడ్‌ను వీరిద్దరూ రూల్ చేశారు. అక్కయ్య లతా మంగేష్కర్‌తో కలిసి ఆశా భోస్లే చాలానే పాటలు పాడింది.
అక్క చాటు చెల్లెలు
అయితే వ్యక్తిగతంగా మాత్రం వీరిద్దరి మధ్య చివరి వరకు వైరం కొనసాగింది. అశా భోస్లే, లతా మంగేష్కర్ మధ్య ఉన్న విభేదాల ఆధారంగా బాలీవుడ్‌లో ఏకంగా ఓ సినిమా కూడా వచ్చింది. సింగర్‌గా ఆశా భోస్లే కెరీర్ మొదలుపెట్టిన టైమ్‌కు లతా మంగేష్కర్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నారు. కెరీర్ ఆరంభంలో ఆశా ఏ పాట పాడిన లతా మంగేష్కర్ వాయిస్‌తో కంపేర్ చేసేవారట. అక్క చాటు చెల్లెలు అనే ముద్ర నుంచి బయటపడటానికి ఆశా భోస్లేకు చాలా కాలమే పట్టిందట. అక్కయ్య వాయిస్‌లోని మాధుర్యాన్ని పలికించడం తనకు చేతకాదనే అభద్రతా భావం కూడా ఆశా భోస్లే ఉండేదట.
అక్క మాట కాదని
గణపతిరావును భోస్లేను ఆశా పెళ్లిచేసుకోవడం లతా మంగేష్కర్ వ్యతిరేకించింది. అక్క మాటను కాదని పెళ్లిచేసుకోవడంతో వీరి మధ్య చాలా కాలం పాటు మాటలు లేకుండా పోయాయి. ఆ తర్వాత ఓపీ నయ్యర్‌తో లతా మంగేష్కర్ బంధంపై అప్పట్లో ఆశా భోస్లే బహిరంంగానే విమర్శలు చేయడం కూడా అక్కాచెల్లెళ్ల మధ్య దూరం పెరగడానికి కారణమైంది. విభేదాలను పక్కనపెట్టి కలవాలని చాలా సార్లు అనుకున్నారు కుదరలేదు. గొడవలను పక్కనపెట్టి కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. 1951లో దమన్ సినిమా కోసం మొదటిసారి ఆశా, లతా కలిసి పాట పాడారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 'మన్ భవన్ కే ఘర్ ఆయే', 'చాప్ తిలక్ సబ్', 'మన్ క్యూ బెహకాస వంటి పాటలొచ్చాయి. మ్యూజిక్ స్టూడియోలో ఒకరి ముఖం మరొకరు చూసుకోవడానికి ఇష్టపడేవారు కాదట. లత తన నోట్‌బుక్‌ను కుడి చేత్తో, ఆశా ఎడమ చేత్తో పట్టుకునేవారట.
ఎదురెదురు నివాసాల్లో...
ముంబైలో లతా మంగేష్కర్, ఆశా భోస్లే 1960 నుంచి చనిపోయేవరకు ఎదురెదురూ ఇళ్లలోనే నివసించారు. సౌత్ ముంబై...గోపాల్ రావ్ దేశ్‌ముఖ్ మార్గ్ లోని ప్రభుకుంజ్‌లో లతా మంగేష్కర్ ఇళ్లు కొన్నారు. ఆమెకు ఎదురు ఇంటినే అశా భోస్లే కొనుగోలు చేశారు. లతా మంగేష్కర్, ఆశా భోస్లే మధ్య గొడవల ఆధారంగా బాలీవుడ్‌లో సాజ్ అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆశా భోస్లే పాత్రలో షబానా ఆజ్మీ కనిపించగా...లతా మంగేష్కర్‌గా అరుణా ఇరానీ నటించింది.

సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



