Trisha | పొలిటికల్ లీడర్‌గా త్రిష – రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో…
చెన్నై క్వీన్ త్రిష పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టబోతుంది. రియల్‌గా కాదు. త్రిష లీడ్ రోల్‌లో తెలుగులో ఓ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో త్రిష పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వెబ్‌సిరీస్‌కు మా ఇంటి బంగారం ఫేమ్ నందిని రెడ్డి దర్వకత్వం వహించబోతున్నట్లు తెలిసింది.
Entertainment | Published On Aug 21, 2026, 4.30 pm IST
Trisha | రాజకీయాల్లోకి త్రిష అరంగేట్రం చేయబోతుంది. పాలిటిక్స్‌లో తన పవర్‌ను చూపించేందుకు రెడీ అయ్యింది. అయితే రియల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. ఓ తెలుగు వెబ్‌సిరీస్‌లో త్రిష పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కరుప్పు తర్వాత...
త్రిష హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ కరుప్పు ఇటీవలే థియేటర్లలో రిలీజై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. కరుప్పు తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లో త్రిషకు ఆఫర్లు వచ్చాయి. వాటిని కాదనుకొని త్రిష తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
రాజకీయ చందరంగంలో...
త్రిష లీడ్ రోల్‌లో తెలుగులో ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ రాబోతున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో రాజకీయ నాయకురాలిగా త్రిష కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ చదరంగంలో తనకు ఎదురైన ఆటుపోట్లను ఓ లేడీ పొలిటీషియన్ ఎలా ఎదుర్కొందనే అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మా ఇంటి బంగారం...
ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో సమంతకు హిట్టు ఇచ్చిన డైరెక్టన్ నందిని రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లు చెబుతున్నారు. వాస్తవ ఘటనలకు ఫిక్షనల్ అంశాలను జోడించి నందిని రెడ్డి అండ్ టీమ్ కథను సిద్దం చేసినట్లు సమాచారం. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో ఈ సిరీస్ రూపొందనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. త్రిష, నందిని రెడ్డి వెబ్‌సిరీస్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానున్నట్లు చెబుతున్నారు.
విజయ్ టీవీకే పార్టీలో...
త్రిష పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దళపతి విజయ్ టీవీకే పార్టీలో ఆమె జాయినయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రూమర్ల నడుమ త్రిష పొలిటికల్ లీడర్ పాత్రలో నటించబోతుండటం ఆసక్తికరంగా మారింది.
విశ్వంభర
త్రిష హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ విశ్వంభర ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత – రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా!
ఆగస్టు 21, 2026

Jyothi Rai | హీరోయిన్‌గా గుప్పెడంత మనసు జగతి – సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ఆగస్టు 20, 2026

Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ – భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ – విజయ్ క్యూట్ రిప్లై
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Balu Naik | క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే : కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్
- ●Chinna Reddy group followers | గాంధీ భవన్‌ను ముట్టడించిన చిన్నారెడ్డి వర్గం.. తీవ్ర ఉద్రిక్తత
- ●Stock Markets | వణుకు పుట్టిస్తున్న ముడి చమురు ధరలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●Education | అమెరికాలో తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్న టాప్ 5 యూనివర్సిటీలు ఇవే..
- ●Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్
- ●MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి... ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు

Balu Naik | క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే : కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్

Chinna Reddy group followers | గాంధీ భవన్‌ను ముట్టడించిన చిన్నారెడ్డి వర్గం.. తీవ్ర ఉద్రిక్తత

Stock Markets | వణుకు పుట్టిస్తున్న ముడి చమురు ధరలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..

Education | అమెరికాలో తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్న టాప్ 5 యూనివర్సిటీలు ఇవే..



