Trisha | దళపతి విజయ్ కోసం రంగంలోకి త్రిష – టీవీకే పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం?
దళపతి విజయ్ టీవీకే పార్టీ తరఫున త్రిష ఎన్నికల ప్రచారంలో పాల్గొననుందని వార్తలు వినిపిస్తున్నాయి. తేన్ కాశీ, తూత్‌కూడితో పాటు మరికొన్ని జిల్లాల్లో త్రిషకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ జిల్లాల్లో టీవీకే పార్టీ తరఫున నిర్వహించనున్న ర్యాలీలు, క్యాంపెయిన్‌లో త్రిష భాగం కానుందని టాక్ వినిపిస్తోంది.
Entertainment | Published On Mar 29, 2026, 11.05 am IST
Trisha | అగ్ర హీరో దళపతి విజయ్, చెన్నై క్వీన్ త్రిష త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు కోలీవుడ్‌లో వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్రిష మెడలో విజయ్ మూడుముళ్లు వేయబోతున్నాడని అంటున్నారు. ఇటీవలే ఓ నిర్మాత కొడుకు రిసెప్షన్‌కు వీరిద్దరు జంటగా హాజరుకావడంతో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ రూమర్లపై విజయ్‌తో పాటు త్రిష మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. మరోవైపు విజయ్, త్రిష బంధంపై చాలానే విమర్శలు వస్తోన్నాయి. కొంత మంది సినీ ప్రముఖులు మాత్రం అది వారి వ్యక్తిగత విషయమని, ఇతరుల జోక్యం అనవసరం అంటూ కామెంట్స్ చేస్తుండగా.. చాలా మంది తప్పుపడుతున్నారు. విజయ్, సంగీత వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్లడానికి త్రిషనే కారణమంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఎన్నికలతో బిజీ....
ఏప్రిల్‌లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో దళపతి విజయ్ ఫుల్ బిజీగా ఉన్నారు. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తమిళనాడులోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయ్ పార్టీ బరిలో నిలవబోతుంది. విజయ్ రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడింది.
త్రిష ప్రచారం...
టీవీకే పార్టీ తరఫున విజయ్ చెన్నై నుంచి పోటీ చేయబోతున్నాడు. విజయ్‌కి సపోర్ట్‌గా త్రిష ఎన్నికల ప్రచారంలో పాల్గొననుందని అంటున్నారు. తొలుత త్రిష కూడా టీవీకే పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలవనుందని వార్తలొచ్చాయి. కానీ త్రిషకు టికెట్ ఇస్తే పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతోనే చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని విజయ్ వాయిదావేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం త్రిష సేవలను మాత్రం వినియోగించుకోబోతున్నాడట విజయ్. తమిళనాడులోని దక్షిణాది జిల్లాలైనా తూత్‌కూడి, తేన్ కాశీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో త్రిషకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ప్రాంతాల్లోని టీవీకే అభ్యర్థుల తరఫున త్రిష ప్రచారం చేయడమే కాకుండా ర్యాలీల్లో పాల్గొననుందని చెబుతున్నారు. త్రిష మాత్రమే కాకుండా మరికొందరు సినీ ప్రముఖులు కూడా విజయ్ పార్టీకి సపోర్ట్‌గా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
మే 19, 2026

Trisha | త్రిషకు ఇష్టమైన ఫుడ్ ఇదేనట – సీక్రెట్ రివీల్ చేసిన స్టైలిస్ట్
మే 18, 2026

Tollywood | సౌత్‌లో టాప్… నార్త్‌లో ఫ్లాప్… టాలీవుడ్ బ్యూటీలకు అచ్చిరాని బాలీవుడ్!
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



