Trisha | మధురైలో వెలిసిన విజయ్, త్రిష పోస్టర్లు – చెన్నై క్వీన్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి రూమర్లు?
త్రిష పొలిటికల్ ఎంట్రీ రూమర్లు తమిళనాట మరోసారి ఆసక్తికరంగా మారాయి. టీవీకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ రింగ్ స్కీమ్‌ను మధురైలో సీఎం విజయ్ సోమవారం ప్రారంభించారు. ఈ స్కీమ్ ప్రారంభోత్సవం సందర్భంగా మధురై త్రిష ఫ్యాన్స్ అసోసియేషన్లు పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఈ పోస్టర్లలో విజయ్‌తో పాటు త్రిష కూడా కనిపిస్తోంది.
Entertainment | Published On Sep 28, 2026, 3.24 pm IST
Trisha |కోలీవుడ్ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందంటూ తమిళనాట చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దళపతి విజయ్ టీవీకే పార్టీలో చెన్నై క్వీన్ చేరనుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై త్రిష ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. అవునని చెప్పలేదు. కాదని ఖండించలేదు. అయినా రూమర్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా త్రిష పొలిటికల్ వార్తలు తమిళనాట మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
గోల్డ్ రింగ్ స్కీమ్...
టీవీకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ రింగ్ స్కీమ్‌ను మధురైలో సీఎం విజయ్ సోమవారం ప్రారంభించారు. ఈ స్కీమ్ ప్రారంభోత్సవం సందర్భంగా మధురై వస్తోన్న విజయ్‌కి స్వాగతం పలుకూతూ టీవీకే వర్గాలతో విజయ్ అభిమానులు భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వీటిలో త్రిష ఫ్యాన్స్ అసోసియేషన్ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి.
త్రిష ఫ్యాన్స్ అసోసియేషన్...
మధురై త్రిష ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కొందరు అభిమానులు పోస్టర్లు సిటీ మొత్తం అంటించారు. ఈ పోస్టర్లలో సీఎం విజయ్‌తో పాటు త్రిష కూడా కనిపిస్తోంది. విజయ్ ప్రవేశపెడుతోన్న కొత్త స్కీమ్ విజయవంతం కావాలని ఆకాంక్షించడమే కాకుండా టీవీకే ప్రభుత్వం సంక్షేమ పథకాలను, విజయ్ పాలనను పొగుడుతూ స్లోగన్లు ఈ పోస్టర్లలో కనిపిస్తున్నాయి.
స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు...
ఈ పోస్టర్లతో త్రిష రాజకీయ అరంగేట్రంపై చర్చలు మొదలయ్యాయి. టీవీకే పార్టీలో చెన్నై క్వీన్ చేరడం ఖాయమని అంటున్నారు. త్రిష పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్‌ను బలోపేతం చేస్తూ వారి ద్వారా కొన్ని స్వచ్ఛంద సహాయక కార్యక్రమాలు నిర్వహించేలా త్రిష ప్లాన్ చేస్తుందని చెబుతున్నారు. ఈ రూమర్లపై ఈ ఏడాది చివరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
లండన్‌లో...
ఇటీవలే దళపతి విజయ్ అధికారిక పర్యటన నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడ కూడా త్రిషను విజయ్ కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంలో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Vijay | శిశువులకు బంగారు ఉంగరం.. మేనమామ కానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
సెప్టెంబర్ 28, 2026

Gold Rings | ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన శిశువులకు బంగారం ఉంగరాలు
సెప్టెంబర్ 27, 2026

Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Motorola | మోటోరోలా కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
- ●Jail Bharo Andolan | అక్టోబర్ 2న సీజేపీ జైల్ భరో ఆందోళన.. కీలక అప్డేట్ ఇచ్చిన దిప్కే
- ●KP Vivekananda | ఈడీ కేసులో పొంగులేటిని కాపాడుతుందెవరో చెప్పాలి
- ●Austria Working Holiday Visa India | జాబ్ ఆఫర్ అక్కర్లేదు, స్పాన్సర్ అవసరం లేదు: భారతీయులకు ఆస్ట్రియా గోల్డెన్ ఛాన్స్.. 12 నెలల వర్కింగ్ వీసా వివరాలివే
- ●Rakul Preet Singh | అక్రమ లావాదేవీలు.. రకుల్ ప్రీత్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు
- ●Sachin Tendulkar | సచిన్‌తో ఓపెన్ఏఐ పార్ట్నర్షిప్.. చాట్‌జీపీటీ ద్వారా కీలక భాగస్వామ్యం..

Motorola | మోటోరోలా కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..

Jail Bharo Andolan | అక్టోబర్ 2న సీజేపీ జైల్ భరో ఆందోళన.. కీలక అప్డేట్ ఇచ్చిన దిప్కే

KP Vivekananda | ఈడీ కేసులో పొంగులేటిని కాపాడుతుందెవరో చెప్పాలి

Austria Working Holiday Visa India | జాబ్ ఆఫర్ అక్కర్లేదు, స్పాన్సర్ అవసరం లేదు: భారతీయులకు ఆస్ట్రియా గోల్డెన్ ఛాన్స్.. 12 నెలల వర్కింగ్ వీసా వివరాలివే



