Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ – సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్…
త్రిష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నట్లు చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల నడుమ త్రిష తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ కోసం త్రిష పదిహేను కోట్ల వరకు రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం.
Entertainment | Published On Oct 29, 2026, 5.23 pm IST
Trisha | త్రిష (Trisha )రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే కోయంబత్తూరులో చెన్నై క్వీన్ చేసిన ఓ రోడ్ షో తమిళనాట చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటివరకు ఈ పొలిటికల్ రూమర్లపై త్రిష రియాక్ట్ కాలేదు. అవునని చెప్పలేదు. కాదని ఖండించడం లేదు. ఈ పొలిటికల్ రూమర్ల నడుమ తాజాగా త్రిష తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో...
మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందుతోన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాన్సెప్ట్‌తో పాటు తన క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండటంతో ఇందులో నటించడానికి ఈ కోలీవుడ్ బ్యూటీ అంగీకరించినట్లు సమాచారం. అమ్మవారిగా, సాధారణ యువతిగా రెండు షేడ్స్‌తో సాగే పాత్రలో చెన్నై క్వీన్ కనిపించనున్నట్లు చెబుతోన్నారు. తెలుగులో రూపొందుతోన్న ఈ సిరీస్‌ను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
పదిహేను కోట్లు...
కాగా ఈ మైథాలజీ వెబ్‌సిరీస్ కోసం త్రిష పదిహేను కోట్ల వరకు రెమ్యూనరేషన్ (Remuneration) స్వీకరించినట్లు సమాచారం. దక్షిణాది భాషల్లో త్రిషకు ఉన్న ఇమేజ్, భారీ ఫ్యాన్‌ఫాలోయింగ్ కారణంగా ఆమె డిమాండ్ చేసిన పారితోషికాన్ని ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాల కోసం పది నుంచి పన్నెండు కోట్ల మధ్య రెమ్యూనరేషన్ అందుకుంటోంది. సినిమాలకు మించి వెబ్‌సిరీస్ కోసం త్రిష పారితోషికం స్వీకరించనుండటం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్
త్రిష మైథాలజీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది చివరలో త్రిష తెలుగు వెబ్‌సిరీస్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. మహిళా ప్రధాన సినిమాలతో తెలుగులో ఫేమస్ అయిన ఓ లేడీ డైరెక్టర్ త్రిష వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. తెలుగులో త్రిష నటిస్తోన్న సెకండ్ వెబ్‌సిరీస్ ఇది. గతంలో బృంద పేరుతో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చేసింది. ప్రస్తుతం బృందకు సీజన్ 2 రాబోతుంది.
సైకలాజికల్ హారర్ మూవీ...
తమిళంలో ఇటీవలే ఓ సైకలాజికల్ హారర్ మూవీని అంగీకరించింది త్రిష. లండన్‌లో ఈ మూవీ షూటింగ్ కొంత భాగం జరిగింది. మరోవైపు త్రిష హీరోయిన్‌గా నటించిన విశ్వంభర మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu Web Series | కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీ టైటిల్‌తో తెలుగు వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే
అక్టోబర్ 26, 2026

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే – నాని, కీర్తి సురేష్ మూవీస్‌ను మిస్సవ్వొద్దు
అక్టోబర్ 23, 2026

Web Series | ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ – తల లేని డెడ్‌బాడీ మిస్టరీతో…
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?
- ●Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు
- ●Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?
- ●CEC Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అవినీతి దర్యాప్తు: కేరళం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.700 కోట్ల రోడ్డు ప్రాజెక్టులో ఏం జరిగింది?
- ●Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - రంగంలోకి అల్లు అర్జున్ డైరెక్టర్
- ●Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ షేర్ల ర్యాలీ.. రెండు రోజుల్లో 33 శాతం లాభాలు..

KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?

Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు

Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?

CEC Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అవినీతి దర్యాప్తు: కేరళం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.700 కోట్ల రోడ్డు ప్రాజెక్టులో ఏం జరిగింది?



