త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త‌మిళ‌నాడు మాజీ సీఎంగా త్రిష – ఎంజీఆర్ బ‌యోపిక్‌లో చెన్నై క్వీన్‌?

త్రిష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు చాలా కాలంగా త‌మిళ‌నాట రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల న‌డుమ చెన్నై క్వీన్ ఓ పొలిటిక‌ల్ డ్రామా మూవీని అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఎంజీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత పాత్ర‌లో త్రిష న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

N

Entertainment | Published On Oct 16, 2026, 2.37 pm IST

Trisha | త‌మిళ‌నాడు మాజీ సీఎంగా త్రిష – ఎంజీఆర్ బ‌యోపిక్‌లో చెన్నై క్వీన్‌?
Advertisement

Trisha | చెన్నై క్వీన్ త్రిష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే త్రిష పొలిటిక‌ల్ ఎంట్రీని ఉద్దేశిస్తూ త‌మిళ‌నాట వెలిసిన పోస్ట‌ర్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ రూమ‌ర్ల న‌డుమ చెన్నై క్వీన్ త్రిష ఓ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ సినిమాను అంగీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

ప్ర‌జానాయ‌కుడు...

ప్ర‌జానాయ‌కుడిగా అభిమానుల చేత నీరాజ‌నాలు అందుకున్న త‌మిళ లెజెండ‌రీ యాక్ట‌ర్‌, మాజీ సీఎం ఎంజీఆర్ జీవితం ఆధారంగా ద‌ర్శ‌క‌నిర్మాత ఎంజే బ‌షీర్ ఓ పాన్ ఇండియ‌న్ మూవీని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ వారంలోనే ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎంజీఆర్ సినీ రాజ‌కీయ జీవితంతో పాటు జ‌య‌ల‌లిత‌తో అత‌డికి ఉన్న అనుబంధం గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని కోణాల‌తో ఈ పొలిటిక‌ల్ డ్రామా మూవీ రూపొందుతోన్న‌ట్లు తెలిసింది.

జ‌య‌ల‌లిత పాత్ర‌లో...

ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో పాన్ ఇండియ‌న్ ఇమేజ్ ఉన్న హీరో న‌టించ‌బోతున్న‌ట్లు బ‌షీర్ పేర్కొన్నారు. జ‌య‌ల‌లిత పాత్ర కోసం త్రిష‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. చ‌దువు, వ్య‌క్తిగ‌త జీవితంతో ప‌లు విష‌యాల్లో జ‌య‌ల‌లిత‌, త్రిష జీవితాల మ‌ధ్య ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయ‌ని నిర్మాత చెప్పారు. ప్ర‌జ‌ల్లో గొప్ప ఆద‌ర‌ణ‌, అభిమానం ఉన్న నాయ‌కురాలి పాత్ర‌కు త్రిష లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ అయితేనే న్యాయం చేయ‌గ‌ద‌ని చెప్పారు. ఇప్ప‌టికే త్రిష‌ను క‌లిసి క‌థ‌ను వినిపించామ‌ని అన్నారు. కానీ త్రిష నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేద‌ని అంటున్నారు.

విశ్వంభ‌ర‌...

త్రిష ఇటీవ‌లే ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం లండ‌న్‌లో జ‌రుగుతోంది. తెలుగులో త్రిష హీరోయిన్‌గా న‌టించిన విశ్వంభ‌ర రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సోషియో ఫాంట‌సీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా న‌టించారు. గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో వాయిదాప‌డిన ఈ మూవీ వ‌చ్చే ఏడాది మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement