Kollywood | సాఫ్ట్ అండ్ బోల్డ్ కాంబో … ఇద్దరు హీరోయిన్లతో కోలీవుడ్ డైరెక్టర్ లేడీ ఓరియెంటెడ్ మూవీ!
బోల్డ్ బ్యూటీ కయదు లోహర్, ట్రెడిషనల్ రోల్స్‌తో పాపులర్ అయిన ప్రియాంక అరుళ్ మోహన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
Entertainment | Published On Jun 1, 2026, 3.48 pm IST
Kollywood | కయదు లోహర్ పేరు చెబితే బోల్డ్ రోల్స్ ఎక్కువగా గుర్తొస్తాయి. డ్రాగన్, ఫంకీతో పాటు పలు సినిమాల్లో బబ్లీ గర్ల్‌గా కనిపించి ఆడియెన్స్‌ను మెప్పించింది. ప్రియాంక అరుళ్ మోహన్ కెరీర్ ఆరంభం నుంచి ట్రెడిషనల్ రోల్స్ చేస్తోంది. సాఫ్ట్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇద్దరు హీరోయిన్లు కలయికలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ రాబోతుంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను సోమవారం అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీకి మంజనాతి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ తమిళ సినిమాకు దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందించబోతున్నారు.
పోస్టర్ వైరల్...
మంజనాతి పోస్టర్‌ను మారి సెల్వరాజ్ సోషల్ మీడియాలో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఓ గిటార్‌పై ఓ ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నట్లుగా...మరో యువకుడు బైక్‌పై వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కొండ అంచున ఉన్న ఓ గ్రామం కనిపిస్తోంది.
మంజునాతిలో భాగం కావడం ఆనందంగా ఉందని, డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఇదంటూ ప్రియాంక అరుళ్ మోహన్, కయదు లోహర్ ట్వీట్స్ చేశారు. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన వాళా మూవీకి సీక్వెల్ ఇదంటూ ప్రచారం జరుగుతోంది. వాళాలో మారి సెల్వరాజ్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను చూపించారు. మంజునాతిలో మాత్రం మారి సెల్వరాజ్ వైఫ్ దివ్య రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
ఏడు సినిమాలు...
ప్రస్తుతం కయదు లోహర్ తెలుగులో ప్యారడైజ్‌తో పాటు తమిళం, మలయాళ భాషల్లో కలిపి ఏకంగా ఏడు సినిమాలు చేస్తోంది. మరోవైపు ప్రియాంక అరుళ్ మోహన్ ఇటీవలే మేడిన్ కొరియాతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ప్రస్తుతం 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే కన్నడ మూవీతో బిజీగా ఉంది.
తాజావార్తలు
- ●CID Chief Charu Sinha | ఆన్ లైన్ బెట్టింగ్‌పై సిట్ వేశాం.. 11 మందిని అరెస్ట్ చేశాం: సీఐడీ చీఫ్ చారుసిన్హా
- ●Ashok Dinda | సువేందు కేబినెట్లోకి టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్..!
- ●Telangana | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం
- ●Governors Convoy | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన గర్భిణి.. గవర్నర్ కాన్వాయ్కి అడ్డుగా రోడ్డుపై బైఠాయించిన భర్త
- ●India Oman CEPA | గల్ఫ్ ట్రేడ్‌లో గేమ్ ఛేంజర్ 'ఇండియా-ఒమన్ CEPA': హార్ముజ్ టెన్షన్స్‌కు చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ రూట్!
- ●SIP | 45 ఏళ్లకే కోటీశ్వరులు కావాలంటే.. ఎస్ఐపీలో ఇలా చేయవచ్చు..

CID Chief Charu Sinha | ఆన్ లైన్ బెట్టింగ్‌పై సిట్ వేశాం.. 11 మందిని అరెస్ట్ చేశాం: సీఐడీ చీఫ్ చారుసిన్హా

Ashok Dinda | సువేందు కేబినెట్లోకి టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్..!

Telangana | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం

Governors Convoy | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన గర్భిణి.. గవర్నర్ కాన్వాయ్కి అడ్డుగా రోడ్డుపై బైఠాయించిన భర్త






