త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి లోకేష్ క‌న‌గ‌రాజ్ రొమాంటిక్ మూవీ – హీరోయిన్‌గా హైద‌రాబాద్ బ్యూటీ

కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన లేటెస్ట్ త‌మిళ మూవీ 29 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో హైద‌రాబాద్ బ్యూటీ ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On May 31, 2026, 6.37 pm IST

OTT  | ఓటీటీలోకి లోకేష్ క‌న‌గ‌రాజ్ రొమాంటిక్ మూవీ – హీరోయిన్‌గా హైద‌రాబాద్ బ్యూటీ
Advertisement

OTT | కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ నిర్మించిన త‌మిళ మూవీ 29 ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన‌ ఈ సినిమాలో హైద‌రాబాద్ బ్యూటీ ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా న‌టించింది. విధు క‌థానాయ‌కుడిగా క‌నిపించిన ఈ సినిమాకు ర‌త్న కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోలీవుడ్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజుతో క‌లిసి లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ సినిమాను నిర్మించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో...

29 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది.
లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్రొడ్యూస‌ర్ కావ‌డంతో రిలీజ్‌కు ముందు ఈ చిన్న సినిమా త‌మిళ ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. క‌థ‌లోని లోపాలు, డైరెక్ష‌న్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ఫెయిల్యూర్‌గా నిలిచింది. క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమా ఫెయిలైనా ప్రీతి అస్రానీ యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరొచ్చింది. 2010 టైమ్ పీరియ‌డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందింది.

స‌త్య‌, విజీ ప్రేమ‌క‌థ‌...

స‌త్య 29 ఏళ్లు వ‌చ్చినా జాబ్ లేకుండా స్నేహితుల‌తో క‌లిసి ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో అత‌డికంటూ ఎలాంటి ల‌క్ష్యం ఉండ‌దు. విజీ ఐఏఎస్ సాధించాల‌నే త‌ప‌న‌తో క‌ష్ట‌ప‌డుతుంది. స‌త్య‌, విజీకి అనుకోకుండా ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. స‌త్య జీవితంలో సెటిల్ కాక‌పోవ‌డంతో వారి ప్రేమ‌కు పెద్ద‌లు అడ్డు చెబుతారు. త‌న ప్రేమ‌ను గెలుపించుకోవ‌డానికి స‌త్య ఏం చేశాడు? 29వ ఏడాది అత‌డికి ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని జ్ఞాప‌కాల‌ను ఎలా మిగిల్చింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

త‌మిళంలో బిజీ....

చైల్డ్ యాక్ట‌ర్‌గా తెలుగులో ప్రీతి అస్రానీ కెరీర్ ప్రారంభ‌మైంది. సీటీ మార్‌, స‌మంత య‌శోద సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది. ప్రెజ‌ర్ కుక్క‌ర్‌తో పాటు మ‌రికొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌లో హీరోయిన్‌గా న‌టించింది. అయోథీ మూవీ త‌మిళంలో ప్రీతి అస్రానీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. బ‌ల్తీ, కిస్‌, ఎలెక్ష‌న్ సినిమాల‌తో కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

 

Advertisement
Advertisement