Trisha | స్పెషల్ ఫొటోతో సీఎం విజయ్‌కి విషెస్ చెప్పిన త్రిష – బ్రేకప్ రూమర్లపై చెన్నై క్వీన్ రియాక్షన్ అదుర్స్
దళపతి విజయ్ తో రిలేషన్‌కు బ్రేకప్ చెప్పినట్లు వస్తోన్న రూమర్లపై తనదైన స్టైల్‌లో త్రిష బదులిచ్చింది. విజయ్ బర్త్‌డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తోన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గంటలోనే ఈ ఫొటోకు మిలియన్‌కుపైగా లైక్స్ వచ్చాయి. త్రిష ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jun 23, 2026, 9.07 pm IST
Trisha | తమిళనాడు సీఎం దళపతి విజయ్‌తో బ్రేకప్ రూమర్లకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టింది చెన్నై క్వీన్ త్రిష. దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయనకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. కానీ విజయ్‌కి త్రిష విషెస్ చెప్పకపోవడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. బర్త్‌డే రోజు తమిళనాడు సీఎంను త్రిష అన్‌ఫాలో చేసిందని, అతడితో అనుబంధానికి ముగింపు పలికినట్లు వార్తలొచ్చాయి. అభిప్రాయభేదాలను పక్కనపెట్టి భార్య సంగీతతో విజయ్ తిరిగి కలవబోతున్నాడని, ఇద్దరి మధ్య కుటుంబసభ్యులు రాజీ కుదిర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలోనే త్రిష హర్ట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు హల్‌చల్ చేశాయి.
స్పెషల్ ఫొటో...
ఈ రూమర్లకు తనదైన స్టైల్‌లో త్రిష చెక్ పెట్టింది. ఒకరోజు ఆలస్యంగా విజయ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పింది. విజయ్ బర్త్‌డేను సెలబ్రేట్ చేస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో కేక్ ముందు చిరునవ్వులు చిందిస్తూ విజయ్ కనిపిస్తోండగా...అతడిని చూసి మురిసిపోతూ త్రిష కనిపిస్తోంది. చెన్నై క్వీన్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. "నా జీవితంలో ప్రతి దానికి ఓ అర్థాన్ని కల్పించిన ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ఈ పోస్ట్‌లో త్రిష పేర్కొన్నది. లవ్ ఎమోజీని యాడ్ చేసింది. గంటలోనే త్రిష పోస్ట్‌కు మిలియన్‌కుపైగా లైక్స్, లక్ష ఇరవై ఒక్క వేలకుపైగా కామెంట్స్ వచ్చాయి.
ఈ ఫొటోతో విజయ్, త్రిష బంధంపై మరోసారి తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. కాగా విజయ్ త్రిష ఇప్పటివరకు కలిసి ఐదు సినిమాలు చేశారు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trisha | దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేకప్ నిజమేనా ? అసలు ట్విస్ట్ ఇదే!
జూన్ 23, 2026

Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? – సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష
జూన్ 23, 2026

Keerthy Suresh | ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టిన మహానటి – నాలుగు భాషల్లో బిజీ
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●Telangana Secretariat Job Fraud | సచివాలయంలో జాబ్.. 'తెల్ల చొక్కా'తో వస్తేనే ఇంటర్వ్యూ! ఎస్పీఎఫ్ పోలీసులకు అడ్డంగా బుక్కైన నకిలీ అధికారి
- ●Samantha | సమంత మాస్ ర్యాంపేజ్ - యాభై కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం - నాలుగు రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతంటే?
- ●Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్న : హరీశ్‌రావు
- ●Ketan Agarwal Murder Case | అవును.. నేనే లోయలోకి తోసి చంపేశా.. తప్పు ఒప్పుకున్న పుణే యువతి సియా
- ●ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గాంధీనగర్ ఎస్ఐ
- ●Himayat Sagar | హిమాయత్ సాగర్‌కు పోటెత్తిన వరద.. అప్రమత్తమైన జలమండలి

Telangana Secretariat Job Fraud | సచివాలయంలో జాబ్.. 'తెల్ల చొక్కా'తో వస్తేనే ఇంటర్వ్యూ! ఎస్పీఎఫ్ పోలీసులకు అడ్డంగా బుక్కైన నకిలీ అధికారి

Samantha | సమంత మాస్ ర్యాంపేజ్ - యాభై కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం - నాలుగు రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతంటే?

Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్న : హరీశ్‌రావు

Ketan Agarwal Murder Case | అవును.. నేనే లోయలోకి తోసి చంపేశా.. తప్పు ఒప్పుకున్న పుణే యువతి సియా



