త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త్రిష వ‌ర్సెస్ క‌రుప్పు టీమ్ – సూర్య సినిమాపై చెన్నై క్వీన్‌ సెటైరిక‌ల్ పోస్ట్‌లు

సూర్య‌, త్రిష హీరోహీరోయిన్లుగా న‌టించిన క‌రుప్పు మూవీ మే 14న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. క‌రుప్పు రిలీజ్ ముంగిట చెన్నై క్వీన్‌ త్రిష‌తో నిర్మాత‌ల‌కు ఏర్ప‌డిన వివాదం కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. నిర్మాత‌ల‌పై శుక్ర‌వారం త్రిష చేసిన పోస్ట్‌లు వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On May 1, 2026, 4.49 pm IST

Trisha | త్రిష వ‌ర్సెస్ క‌రుప్పు టీమ్ – సూర్య సినిమాపై చెన్నై క్వీన్‌ సెటైరిక‌ల్ పోస్ట్‌లు
Advertisement

Trisha |  కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా న‌టిస్తోన్న క‌రుప్పు మూవీ మే 14న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. దాదాపు ఇర‌వై ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత సూర్య‌, త్రిష కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఆర్‌జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

త్రిష వ‌ర్సెస్ క‌రుప్పు టీమ్‌....

గ‌త ఏడాది దీపావ‌ళికి క‌రుప్పు రిలీజ్ కావాల్సింది. ఓడీటీ డీల్‌ ఆల‌స్యం కావ‌డంతో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు మే 14న త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది. విడుద‌ల ముంగిట త్రిష‌తో క‌రుప్పు టీమ్ మ‌ధ్య నెల‌కొన్న వివాదం కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆడియో లాంఛ్‌కు మిస్సింగ్‌...

క‌రుప్పు ప్ర‌మోష‌న్స్‌కు త్రిష‌ను కావాల‌నే మేక‌ర్స్ దూరం పెడుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే మ‌ధురైలో క‌రుప్పు ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో సూర్య‌తో పాటు ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు అంద‌రూ అటెండ్ అయ్యారు. కానీ త్రిష మాత్రం క‌నిపించ‌లేదు. క‌నీసం ఆమె వీడియో బైట్‌ను కూడా వేడుక‌లో టెలికాస్ట్ చేయ‌లేదు. ఆడియో వేడుక‌లో న‌టీన‌టులంద‌రి గురించి మాట్లాడిన సూర్య‌...క‌నీసం త్రిష‌ పేరు కూడా ఎత్త‌లేదు. డైరెక్ట‌ర్ మిన‌హా మిగిలిన యాక్ట‌ర్లు, టెక్నీషియ‌న్లు కూడా త్రిష గురించి పెద్ద‌గా మాట్లాడ‌క‌పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. క‌ర‌ప్పు మేక‌ర్స్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

న‌టించిన సంగ‌తే మ‌ర్చిపోయా...

తాజాగా త్రిష లుక్ వీడియోను మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ వీడియోపై త్రిష సెటైరిక‌ల్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ సినిమాలో నేను న‌టించిన సంగ‌తే మ‌ర్చిపోయాను. ఈ వీడియోతో క‌నీసం ఇప్ప‌టికైనా గుర్తు చేసినందుకు థాంక్స్ అంటూ నిర్మాత‌ల‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేసింది.
ఆడియో ఫంక్ష‌న్‌కు వెళ్ల‌కుండా ఇలాంటి కుట్ర‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌డం ఎందుకు అంటూ ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు కూడా త్రిష రియాక్ట్ అయ్యింది. ఆడియో ఫంక్ష‌న్‌కు న‌న్ను ఇన్వైట్ చేస్తూ మేక‌ర్స్ పంపించిన మెయిల్ మిస్స‌య్యిందంటూ చెప్పింది. ఇన్‌డైరెక్ట్‌గా త‌న‌ను ఈవెంట్‌కు ఎవ‌రూ ఆహ్వానించ‌లేద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. త్రిష పోస్ట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

అస‌లేమైంది....

క‌రుప్పు టీమ్‌కు, త్రిష‌కు మ‌ధ్య ఏం జ‌రుగుతుంది అన్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో అనుబంధం కార‌ణంగానే త్రిష ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది. ఆమె వ్య‌క్తిగ‌త జీవితం తాలూకు వివాదాల‌ ఎఫెక్ట్ సినిమాపై ప‌డ‌కూడ‌ద‌నే మేక‌ర్స్ ఆమెను ప్ర‌మోష‌న్స్‌కు దూరం పెట్టిన‌ట్లు చెబుతున్నారు.

విజ‌య్ హీరోగా...

మ‌రోవైపు క‌రుప్పు మూవీని మొద‌ట ద‌ళ‌ప‌తి విజ‌య్‌ని హీరోగా అనుకున్నార‌ట‌. విజ‌య్ కోస‌మే ఈ సినిమాను త్రిష అంగీక‌రించింద‌ట‌. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న విజ‌య్ ఈ సినిమా నుంచి అర్ధాంత‌రంగా త‌ప్పుకున్నాడ‌ట‌. అప్ప‌టికే ఈ సినిమా క‌మిటైన త్రిష అయిష్టంగానే ఇందులో న‌టించిన‌ట్లు చెబుతోన్నారు. ఏది ఏమైనా క‌రుప్పు మేక‌ర్స్‌ను ఉద్దేశించి త్రిష పెట్టిన పోస్ట్‌లు మాత్రం వైర‌ల్ అవుతోంది.

 

Advertisement
Advertisement