Trisha | జననాయగన్ డైరెక్టర్‌తో త్రిష మూవీ – షూటింగ్ పూర్తయిన పన్నెండేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్
త్రిష హీరోయిన్‌గా నటించిన ఓ తమిళ మూవీ షూటింగ్ పూర్తయిన పన్నెండేళ్ల తర్వాత థియేటర్లలోకి రాబోతుంది. అరవింద్ స్వామి హీరోగా జననాయగన్ ఫేమ్ హెచ్ వినోథ్ కథను అందించిన శతురంగ వెట్టై 2 మూవీ 2014లో షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఫైనాన్షియల్ సమస్యల వల్ల చాలా ఏళ్లుగా రిలీజ్ కాకుండా ఆగిపోయిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
Entertainment | Published On Jun 15, 2026, 5.43 pm IST
Trisha | ఎంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయినా షూటింగ్ పూర్తయిన ఆరు నెలల్లోపే థియేటర్లలోకి వస్తుంటాయి. కొన్ని సార్లు ఆ గ్యాప్ ఏడాది వరకు ఉండొచ్చు. కానీ త్రిష హీరోయిన్‌గా నటించిన ఓ మూవీ మాత్రం షూటింగ్ పూర్తయిన పన్నెండేళ్ల గ్యాప్ తర్వాత థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
క్రైమ్ థ్రిల్లర్ మూవీ...
అరవింద్ స్వామి, త్రిష హీరోహీరోయిన్లుగా 2014లో శతురంగ వెట్టై 2 పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపొందింది. ఈ సినిమాకు జననాయగన్ ఫేమ్ హెచ్ వినోథ్ కథను అందించారు. ఆర్‌వీ నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించాడు. హెచ్ వినోథ్ తొలి సినిమా శతురంగ వెట్టైకి సీక్వెల్‌గా ఈ తమిళ సినిమా రూపొందింది. వరుస సక్సెస్‌లతో జోరుమీదున్న టైమ్‌లో త్రిష చేసిన ఈ సినిమాపై తమిళనాట భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. 2014లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. ప్రమోషన్స్ కూడా చేశారు. టీజర్, ట్రైలర్‌లను రిలీజ్ చేశారు.
కమెడియన్...
శతురంగ వెట్టై 2 సినిమాకు తమిళ కమెడియన్ మనోబాల నిర్మాతగా వ్యవహరించారు. రిలీజ్ ముంగిట ఈ సినిమాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎదురవ్వడంతో చాలా ఏళ్లుగా రిలీజ్ కు నోచుకోలేదు.. ఈ సమస్యలను పరిష్కరించి సినిమాను విడుదల చేయాలని మనోబాల గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు. త్రిష కెరీర్‌లో అన్‌రిలీజ్‌డ్ మూవీస్ లిస్ట్‌లో శతురంగ వెట్టై 2 చేరింది.
త్వరలో థియేటర్లలోకి...
పన్నెండేళ్ల క్రితం షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి రాబోతుంది. శతురంగ వెట్టై 2ను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతోన్నాయట. త్రిష క్రేజ్‌తో ఈ మూవీకి కలిసిరావచ్చునని ప్రచారం జరుగుతోంది. సినిమాకు కొన్ని కొత్త సీన్లను యాడ్ చేయబోతున్నారట. త్వరలోనే శతురంగ వెట్టై 2 రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారట.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

National Awards | నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే – బెస్ట్ యాక్టర్‌గా మమ్ముట్టి – ఉత్తమ నటిగా యామీ గౌతమ్
జులై 18, 2026

National Awards | నేషనల్ అవార్డుల్లో సత్తా చాటిన పుష్ప 2, కల్కి – టాలీవుడ్‌కే అత్యధిక పురస్కారాలు
జులై 18, 2026

Priyanka Chopra | వారణాసి నుంచి ప్రియాంక చోప్రా బర్త్‌డే ట్రీట్ – మహేష్ సినిమా కోసం గ్లోబల్ స్టార్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?
జులై 18, 2026
తాజావార్తలు
- ●Seethakka | గుత్తికోయలను గాయపరిచారు.. మానవతా దృక్పథంతో న్యాయం చేయండి
- ●Kavitha | కమీషన్ల కక్కుర్తితో సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న సీఎం రేవంత్: కవిత
- ●Koushik Yadav | కేటీఆర్ నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నరు
- ●Mammootty | విలన్ పాత్రలతో రెండు సార్లు నేషనల్ అవార్డ్ - మెగాస్టార్ రేర్ రికార్డ్
- ●Revanth Reddy | పెంచిన గడువును అవకాశంగా తీసుకోండి.. క్షేత్రస్థాయికి వెళ్లండి
- ●PV Sindhu | పీవీ సింధు సరికొత్త చరిత్ర.. జపాన్ ఓపెన్ గెలుపొందిన భారత షట్లర్‌గా రికార్డ్..

Seethakka | గుత్తికోయలను గాయపరిచారు.. మానవతా దృక్పథంతో న్యాయం చేయండి

Kavitha | కమీషన్ల కక్కుర్తితో సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న సీఎం రేవంత్: కవిత

Koushik Yadav | కేటీఆర్ నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నరు

Mammootty | విలన్ పాత్రలతో రెండు సార్లు నేషనల్ అవార్డ్ - మెగాస్టార్ రేర్ రికార్డ్



