Trisha | పెళ్లైనవాళ్లు సంతోషంగా లేరు – త్రిష ఓల్డ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్
పెళ్లి గురించి గతంలో త్రిష ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లిచేసుకున్న తన స్నేహితులెవరూ సంతోషంగా ఓ ఇంటర్వ్యూలో త్రిష అన్నది. విజయ్‌ని ఉద్దేశించే త్రిష ఈ కామెంట్లను చేసిందని నెటిజన్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Feb 28, 2026, 5.29 pm IST
Trisha | దళపతి విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ముగింట సంగీత కోర్టును ఆశ్రయించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విజయ్, సంగీత మధ్య మనస్పర్థలకు త్రిషనే కారణమంటూ తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. త్రిషతో విజయ్ డేటింగ్‌లో ఉన్నట్లు చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై విజయ్, త్రిష ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఔనని చెప్పలేదు. అలాగని కాదని ఖండించలేదు. వీరిద్దరు జంటగా వెకేషన్ కోసం నార్వే వెళ్లినట్లు కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
విజయ్ గురించే...
కాగా విజయ్ విడాకుల వ్యవహారం వేళ తన పెళ్లి గురించి త్రిష ఇచ్చిన ఓ పాత స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకున్న తన స్నేహితులు ఎవరూ సంతోషంగా లేరంటూ త్రిష ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. "నాకు తెలిసిన చాలామంది పెళ్లి చేసుకుని, ఆ తర్వాత మనస్పర్థల వల్ల విడాకులు తీసుకోవడానికి సిద్ధం కావడం ప్రత్యక్షంగా చూస్తున్నా. అలాంటి పరిస్థితి నాకు ఎదురుకాకూడదు. అందుకే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదు. అలాగని పెళ్లికి నేను వ్యతిరేకం కాదు. నా మనసుకి నచ్చిన, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. జీవితాంతం నాకు తోడుగా ఉంటాడనే నమ్మకం కలిగే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా" అంటూ త్రిష ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ వీడియో క్లిప్‌ను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. విజయ్ గురించే ఈ ఇంటర్వ్యూలో త్రిష అన్నదని అంటున్నారు.
లీగల్ నోటీసులు...
ఇటీవల తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ కూడా విజయ్, త్రిష బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి తమిళనాడు రాజకీయాలు అర్థం కావాలంటే ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి, ఆమెతో బంధాన్ని తెంచుకోవాలని కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రెసిడెంట్ వ్యాఖ్యలపై త్రిష లీగల్ నోటీసులు జారీ చేసింది. చివరకు అతడు క్షమాపణలు చెప్పాడు.
విజయ్, త్రిష ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశారు. చివరగా వీరిద్దరి కాంబినేషన్‌లో 2023లో లియో మూవీ రిలీజైంది. ఇందులోని లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్లపై అప్పట్లో పెద్ద డిస్కషన్ జరిగింది.
సంబంధిత వార్తలు

Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
మే 19, 2026

Trisha | త్రిషకు ఇష్టమైన ఫుడ్ ఇదేనట – సీక్రెట్ రివీల్ చేసిన స్టైలిస్ట్
మే 18, 2026

Pawan Kalyan on Vijay | తమిళనాడు పరిస్థితులు వేరు, మనవి వేరు: విజయ్ పొలిటికల్ ఎంట్రీ పోలికలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



