Trisha | 16 ఏళ్లకే మిస్ చెన్నై… ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్…త్రిష కెరీర్ గురించిన ఆసక్తికర విషయాలు ఇవే…
తమిళనాట ప్రస్తుతం త్రిష పేరు ట్రెండింగ్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ఆధీక్యంలో కొనసాగుతోండగా...విజయ్ ఇంటికి చేరుకున్న త్రిష అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On May 4, 2026, 4.01 pm IST
Trisha | త్రిష...ప్రస్తుతం తమిళ సినీ రంగంతో పాటు రాజకీయాల్లో ఈ పేరు హాట్ టాపిక్‌గా మారింది. దళపతి విజయ్‌తో బంధం కారణంగా గత కొద్ది రోజులుగా త్రిష తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ మళ్లీ త్రిష ట్రెండింగ్‌లోకి వచ్చింది. తిరుమల చేరుకున్న త్రిష విజయ్ గెలుపు కోసం ప్రత్యేకంగా పూజలు చేయడం ఆసక్తికరంగా మారింది. టీవీకే పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోండగా విజయ్ ఇంటికి చేరుకున్న త్రిష అతడికి శుభాకాంక్షలు చెప్పింది. విజయ్‌తో త్రిష బంధం ఎలా మొదలైందంటే....
మిస్ చెన్నై టైటిల్ నుంచి...
తమిళనాడులోని బ్రహ్మణ కుటుంబంలో పుట్టింది త్రిష. చెన్నైలోనే ఆమె విద్యాభ్యాసం మొత్తం సాగింది. అనుకోకుండా మోడల్‌గా మారిన త్రిష కొన్ని యాడ్స్‌లో నటించింది. 16 ఏళ్ల వయసులోనే మిస్ చెన్నై టైటిల్ గెలుచుకుంది.
క్రిమినల్ సైకాలజిస్ట్...
త్రిషకు క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలనే కోరిక ఉండేదట. కానీ విధి మాత్రం ఆమెను సినిమాల్లో అడుగుపెట్టేలా చేసింది. మోడల్‌గా ఉన్న టైమ్‌లోనే కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించింది. ఆ తర్వాత తమిళ మూవీ జోడీలో హీరోయిన్ సిమ్రాన్ స్నేహితురాలిగా చిన్న పాత్రల్లో కనిపించింది.
సూర్య హీరోగా వచ్చిన తమిళ మూవీ మౌనం పేసియాదేతో కథానాయికగా మారింది. కానీ తొలి సినిమానే డిజాస్టర్‌గా నిలిచి షాకిచ్చింది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సామీతో తొలి సక్సెస్‌ను అందుకుంది...
తెలుగులో వర్షంతో సంచలనం...
తమిళంలో నిలదొక్కుకుంటున్న తరుణంలోనే ప్రభాస్ హీరోగా నటించిన వర్షంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. శోభన్ దర్శకత్వంలో యాక్షన్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో త్రిష పేరు టాలీవుడ్‌లో మారుమోగింది. ఆమె యాక్టింగ్, గ్లామర్‌కు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బుజ్జిగాడు, నమో వెంకటేషతో పాటు త్రిష నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
విజయ్‌తో ఎక్కువ సినిమాలు...
కెరీర్ ఆరంభంలో తమిళంలో దళపతి విజయ్‌తోనే ఎక్కువగా సినిమాలు చేసింది త్రిష. కేవలం నాలుగేళ్ల గ్యాప్‌లో విజయ్, త్రిష కాంబినేషన్‌లో నాలుగు సినిమాలు వచ్చాయి. గిల్లీతో ఫస్ట్ టైమ్ ఈ జోడీ తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో విజయ్, త్రిష జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. తిరుపాచి, ఆతి, కురువి ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
వెంటాడిన పరాజయాలు..
2014 తర్వాత త్రిష బ్యాడ్‌టైమ్ మొదలైంది. ఆమె నటించిన తెలుగు, తమిళ భాషల్లో త్రిష నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో త్రిష పనైపోయిందంటూ విమర్శలొచ్చాయి. కానీ 96 మూవీతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది.
హిందీలో కలిసి రాని అదృష్టం...
తమిళం, తెలుగులో టాప్ స్టార్‌గా వెలుగొందుతున్న త్రిషకు హిందీతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం అదృష్టం కలిసిరాలేదు. హిందీలో కట్టామీటా అనే సినిమా చేసింది. తొలి మూవీనే డిజాస్టర్‌గా నిలవడంతో మళ్లీ త్రిషకు అవకాశాలు రాలేదు. మలయాళం, కన్నడంలో త్రిష చేసిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్...
తమిళ హీరో శింబుతో త్రిష ప్రేమలో పడ్డట్లు రూమర్లు వచ్చాయి. కానీ అవి పుకార్లుగానే మిగిలాయి.ఆ తర్వాత రానా దగ్గుబాటితో త్రిష డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. ఈ వార్తల నడుమే తాను బిజినెస్‌మెన్‌ను వరుణ్ మణియన్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్లు త్రిష ప్రకటించింది. గ్రాండ్‌గా త్రిష, వరుణ్ మణియన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ మనస్పర్థల కారణంగా ఐదు నెలల్లోనే తన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంది. యాక్టింగ్ మానేయమంటూ వరుణ్ మణియన్ తనకు కండీషన్లు పెట్టాడంటూ ఆరోపణలు చేసింది.
విజయ్‌తో ప్రేమాయణం...
ప్రస్తుతం త్రిష దళపతి విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. లియో షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రేమగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. త్రిష కారణంగానే విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు చెబుతోన్నారు. సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన తర్వాత రోజే విజయ్, త్రిష కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



