Chinmayi | జయలలితనూ అవమానించారు – త్రిషకు క్షమాపణ చెప్పాల్సిందే- చిన్మయి, ఖుష్బూ డిమాండ్
త్రిషను ఉద్దేశించి తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పలువురు సినీ రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రిషకు ఉదయనిధి స్టాలిన్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు మహిళలను టార్గెట్ చేయడం సరికాదంటూ చిన్మయి ఫైర్ అయ్యింది.
Chinmayi | చెన్నై క్వీన్ త్రిషను(Trisha) ఉద్దేశించి ప్రతి పక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారాన్ని రేపుతోన్నాయి. కావేరీ నదీ జలాల వివాదంపై సోమవారం తంజావూరులో డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన నిరసనల ర్యాలీలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగించే సమయంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున త్రిష...త్రిష అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలను ఆపకుండా త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు స్టాలిన్. ప్రతి పక్ష నాయకుడి కామెంట్లను అధికార టీవీకే పార్టీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గౌరవ ప్రదమైన హోదాలో ఉంటూ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీకే మహిళా విభాగం నాయకులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఉధయనిధి స్టాలిన్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు.
మహిళలను టార్గెట్ చేయద్దు...
కాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి శ్రీపాద అభ్యంతరం చెప్పింది. "రాజకీయ నాయకులు ప్రజా సమస్యలను వదిలిపెట్టి మహిళలను టార్గెట్ చేయడం మానుకోవాలి. ప్రతి పక్ష నాయకుడు మాట్లాడిన మాటలు మొదట నాకు అర్థం కాలేదు. మంచి నీటి కనెక్షన్ల గురించే ఆయన ప్రస్తావించారని అనుకున్నా. కానీ ఆయన మాట్లాడింది ఓ బూతు అని తర్వాత అర్థమైంది. గౌరవ హోదాలో ఉండి ప్రజలకు మంచి చెప్పాల్సిన ఆయనే ఇలాంటి అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేయడం దారుణం. గతంలో జయలలితకు ఇలాంటి అవమానమే జరిగింది. అప్పటి నాయకులు బూతులు మాట్లాడటం, అసభ్యపదాలు వాడటం సాధారణంగా భావించేవారు. నేటితరం నాయకులు వారికంటే మెరుగ్గా ఉంటారని అనుకుంటే అంతకుమించి దిగజారడం విస్మయాన్ని కలిగిస్తోంది" అంటూ చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
నీచంగా ఉన్నాయి...
ఉదయనిధి వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయని సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ ఫైర్ అయ్యారు. 'ఇలాంటి కుంచిత మనస్తత్వం ఉన్నవారు ఓ పార్టీకి నాయకత్వం వహించాలని, భవిష్యత్తులో రాష్ట్రాన్ని పాలించాలని కోరుకోవడం తప్పే అవుతుంది. ఇలాంటి నాయకుల నుంచి దేవుడే ప్రజలను కాపాడాలి. మహిళలను దూషించడం, కించపరచడం, అవమానించడం రాజకీయం అనుకునే వారి నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలం?' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'మహిళలను గౌరవించాలి అంతే కానీ రాజకీయ స్వార్థం కోసం వారి ఒక పావులా వాడుకోవడం ఎంత మాత్రం క్షమార్షం కాదు. ప్రజల సమక్షంలో బహిరంగ వేదికపై త్రిషను అవమానించినందుకు గాను ఉదయనిధి స్టాలిన్ బేషరతుగా ఆమెకు క్షమాపణ చెప్పాలి' అంటూ తన పోస్ట్‌లో ఖుష్బూ పేర్కొన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
ఆగస్టు 12, 2026

Trisha | అన్నతో విభేదాలు – తమ్ముడితో సినిమా – త్రిష నిర్ణయాలు ఊహాతీతం
ఆగస్టు 9, 2026

Vijay-Stalin Junior War | సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే తప్పేంటి..? సీఎం విజయ్ Vs జూనియర్ స్టాలిన్
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!

Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్

Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!



