Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ – ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు – తెలుగులో స్ట్రీమింగ్
ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఇదయం మురళి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. అధర్వ మురళి హీరోగా నటించిన ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు.
Entertainment | Published On Aug 3, 2026, 8.50 pm IST
Tamil OTT | ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కయదు లోహర్, ప్రీతి ముకుందన్ వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి ఇదయం మురళి పేరుతో తమిళంలో ఓ రొమాంటిక్ కామెడీ సినిమా చేశారు. అధర్వ మురళి హీరోగా నటించిన ఈ సినిమాలో మాళవికా మోహనన్ మరో కథానాయికగా కనిపించింది. లాంగ్ గ్యాప్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇదయం మురళితో యాక్టర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. మలయాళ అగ్ర హీరో ఫహాద్ ఫాజిల్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించాడు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో రూపొందిన ఇదయం మురళి జూలై సెకండ్ వీక్‌లో థియేటర్లలోకి వచ్చింది. ఈ తమిళ సినిమా తెలుగులోనూ హృదయం మురళి పేరుతో రిలీజైంది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ మూవీగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఇదయం మురళి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళం, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
రన్ టైమ్ మైనస్...
ఇదయం మురళి మూవీలో అధర్వ మురళి, ప్రీతి ముకుందన్, కయదు లోహర్ యాక్టింగ్, కామెడీ, ఎమోషన్స్ బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. ప్రెడిక్టబుల్ స్క్రీన్‌ప్లే, రన్‌టైమ్ ఈ సినిమాకు మైనస్ అంటూ విమర్శలు వినిపించాయి.
ముగ్గురు అమ్మాయిలతో ప్రేమాయణం...
హృదయ ఇంట్రోవర్ట్. ట్యూషన్‌లో సమంత అనే అమ్మాయిని ఇష్టపడతాడు. కాలేజీ టైమ్‌లో అతడి లైఫ్‌లోకి అముద ఎంటరవుతుంది. వారికి తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు. అదితితో అతడి పెళ్లి కుదురుతుంది. పెళ్లి పది రోజులు ఉందనగా స్నేహితులతో కలిసి హృదయ అమెరికా ట్రిప్‌కు వెళతాడు. ఆ ట్రిప్ అతడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది. సమంత, అముద, అదితిలో ఎవరిని పెళ్లిచేసుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు






